Megastar movie : దాదాపు 35 ఏళ్లకు పైగా టాలీవుడ్ లో నంబర్ వన్ హీరోగా చెలామణి అవుతున్నాడు మెగాస్టార్ చిరంజీవి. దాదాపు పదేళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా తన స్థానం చెక్కు చెదరలేదు. రీ ఎంట్రీలోనూ అదే జోరు చూపిస్తున్నాడు. ఇప్పటికే విశ్వంభర అనే సోషియో ఫాంటసీ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇటీవల ఈ చిత్రం టీజర్ బయటకు రాగా, మంచి రెస్పాన్స్ వస్తున్నది. చిరంజీవితో సినిమా చేసేందుకు ఎంతో మంది దర్శక, నిర్మాతలు ఇప్పటికీ క్యూ కడుతున్నారు. కానీ మెగాస్టార్ మాత్రం చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఇక మెగాస్టార్ తో కలిసి ఒక్క ఫ్రేమ్ లో అయినా కనిపించాలని ఎంతో మంది నటులు తహహతలాడుతుంటారు. కానీ అలాంటిది ఇద్దరు స్టార్లకు మెగాస్టార్ సినిమాలో అవకాశం రాగా, పలు కారణాలతో రిజెక్ట్ చేశారనే వార్త ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తున్నది.
మెగాస్టార్ హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమా సూపర్ హిట్టయిన విషయం తెలిసిందే. ఇందులో మెగాస్టార్ తమ్ముడిగా మాస్ మహారాజ రవితేజ నటించిన విషయం తెలిసిందే. ఇందులో రవితేజ క్యారెక్టర్ తెలంగాణ యాసతో మాట్లాడాలి. అయితే ఇందుకోసం టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండను డైరెక్టర్ బాబీ సంప్రదించాడట. రవితేజ చేసిన పోలీస్ క్యారెక్టర్ ను ముందుగా డైరెక్టర్ కు చెప్పాడట. కానీ మెగాస్టార్ ను ఎదురించే సన్నివేశాలను సరిగా చేయలేకపోవచ్చనే అనే అనుమానంతో ఆ పాత్రను వద్దనుకున్నాడట. దీంతో ఆ పాత్ర అన్నయ్య సినిమాలో తమ్ముడి పాత్రను చేసిన రవితేజకే మరోసారి దక్కింది. ఈ సినిమా విజయంలో రవితేజ పాత్ర కూడా బాగా ఉపయోగపడింది..
చెల్లెలు క్యారెక్టర్ కు నో చెప్పిన సాయి పల్లవి..
మెహెర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ హీరోగా తెరకెక్కిన సినిమా భోళాశంకర్. ఇందులో కీర్తి సురేష్ చేసిన చెల్లెలి పాత్రకు ముందుగా సాయి పల్లవిని అనుకున్నారట కానీ ఆమె తిరస్కరించడంతో ఆ పాత్ర సురేష్ కీర్తికి దక్కింది. కానీ ఆ సినిమా చిరంజీవికి చేదు అనుభవాన్ని మిగిల్చింద. భారీ డిజాస్టర్ కావడంతో మెగాఫ్యాన్స్ నిరుత్సాహానికి గురయ్యారు.