Megastar Chiranjeevi : ఈ ఏడాది ఓటీటీ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్న మెగాస్టార్ చిరంజీవి..

Megastar Chiranjeevi grand entry into OTT

Megastar Chiranjeevi grand entry into OTT

Megastar Chiranjeevi : మారుతున్న కాలం ప్రకారం తనని తానూ అప్డేట్ చేసుకోవడం లో ఎప్పుడూ ముందు ఉండే వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. అది సినిమా పరంగా అయినా, టెక్నాలజీ పరంగా అయినా ప్రేక్షకుల అభిరుచిని కనిపెట్టడం లో మెగాస్టార్ చిరంజీవి మిగిలిన హీరోలకంటే ఒక అడుగు ముందే ఉంటాడు. అందుకే ఆయన నాలుగు తరాల ప్రేక్షకులను అలరించాడు, ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నాడు.

అయితే మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రస్తుత పరిస్థితి ని రెండు భాగాలుగా విభజిస్తే, కరోనా కి ముందు, కరోనా కి తర్వాత అని చెప్పొచ్చు. ఎందుకంటే కరోనా లాక్ డౌన్ సమయం లో ఓటీటీ బాగా అభివృద్ధి చెందింది. సంవత్సరానికి పైగా ఇంట్లోనే కూర్చోవడం జనాలకు అలవాటు అవ్వడం తో ఓటీటీ కూడా జనాలకు అలాగే అలవాటు అయ్యింది. దీని ప్రభావం థియేటర్స్ పై మొదట్లో చాలా బలంగా పడింది కానీ, ఈమధ్య మళ్ళీ తగ్గిందనే చెప్పొచ్చు. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు కుర్ర హీరోల దగ్గర నుండి స్టార్ హీరోలు, సీనియర్ హీరోల వరకు ప్రతీ ఒక్కరు ఓటీటీ లో ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా ఆ జాబితాలోకి చేరిపోయాడు. ఆయన ఓటీటీ లోకి అతి త్వరలోనే ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా థియేటర్స్ లో చూసే ఆడియన్స్ కంటే ఎక్కువగా ఓటీటీ లో సినిమాలు, వెబ్ సిరీస్ లను చూసే ఆడియన్స్ ఎక్కువ అవ్వడం తో మెగా స్టార్ చిరంజీవి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాడు. ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ తో ఆయన అతి త్వరలోనే ఓటీటీ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సమాచారం. అయితే ఆయన సినిమా చేయబోతున్నాడా, లేదా వెబ్ సిరీస్ ద్వారా మన ముందుకు రాబోతున్నాడా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ప్రముఖ దర్శక రచయితలు వినిపిస్తున్న కథలను వింటున్నాడట మెగా స్టార్ చిరంజీవి. త్వరలోనే దీనికి సంబంధించి ఆయన ఈ ఏడాది లో ఒక అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.

గత ఏడాది ‘వాల్తేరు వీరయ్య’ తో బాక్స్ ఆఫీస్ షాక్ ని చేసి అభిమానులను సంబరాలు చేసుకునేలా చేసిన చిరంజీవి, అదే ఏడాది ‘భోళా శంకర్’ సినిమాతో భారీ డిజాస్టర్ ఫ్లాప్ ని అందుకొని అభిమానులను నిరాశపరిచాడు. ఇప్పుడు ఆయన ‘బింభిసార’ డైరెక్టర్ వశిష్ఠ తో ‘విశ్వంభర’ అనే చిత్రం చెయ్యబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ మధ్యలోనే, ఓటీటీ కి సంబంధించిన వెబ్ సిరీస్/ సినిమా కూడా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

TAGS