Heroine Kartika Wedding : హీరోయిన్ కార్తీక పెళ్లిలో మెగాస్టార్ చిరంజీవి సందడి.. ఫొటోలు వైరల్..!

Heroine Kartika Wedding : సీనియర్ హీరోయిన్ల ఇళ్లలో ఎలాంటి పండుగలు, ఈవెంట్లు అయినా సరే మెగాస్టార్ చిరంజీవి హాజరవుతూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన మరో పెళ్లికి వచ్చి సందడి చేశారు. సీనియర్ హీరోయిన్ కూతురు కార్తీక పెళ్లి విషయం చాలా రోజులుగా వైరల్ అవుతూనే ఉంటుంది. ఈ పెళ్లి ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురు చూస్తున్నారు.

ఇక సీనియర్ హీరోయిన్ రాధ కూతురు కార్తీక గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆమె తెలుగుతో పాటు తమిళంలో చాలా సినిమాల్లో నటించి మంచి ఇమేజ్ ను పొందింది. తెలుగులో ఆమె నాగచైతన్య హీరోగా చేసిన జోష్ సినిమాతో నటించి మెప్పించింది. ఈ మూవీ కమర్షియల్ గా హిట్ కాకపోయినా ఆమెకు మాత్రం మంచి ఇమేజ్ ను సంపాదించుకుంది.

Heroine Kartika Wedding

Megastar Chiranjeevi Attend Heroine Kartika Wedding, Vintage Heroines

దాని తర్వాత ఆమెకు రంగం సినిమాతో మంచి ఇమేజ్ సొంతం అయిపోయింది. ఈ మూవీ మంచి హిట్ కావడంతో పాటు కార్తీక నటనకు మంచి మార్కులు కూడా పడ్డాయి. అయితే తర్వాత ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. ఈ క్రమంలోనేఆ మె ప్రేమించిన రోహిత్ మేనన్ తో పెళ్లికి రెడీ అయిపోయింది. తిరువనంతపురంలోని కవడియార్ ఉదయపూర్ ప్యాలెస్ లో వివాహం చేసుకుంది.

నవంబర్ 19న ఆదివారం ఆమె పెళ్లి పీటలు ఎక్కింది. దీంతో ఆమె పెళ్లికి సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, ఇతర హీరోలు కూడా అటెండ్ అయ్యారు. వారంతా కలిసి పెళ్లిలో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

TAGS