Megastar Chiranjeevi : ‘ఎనిమల్’ చిత్రం పై మెగాస్టార్ చిరంజీవి ఫైర్..సందీప్ వంగ ని ఇంటికి పిలిచి  వార్నింగ్!

Megastar Chiranjeevi fire on the movie 'Animal

Megastar Chiranjeevi fire on the Animal movie

Megastar Chiranjeevi : గత ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించిన సినిమాలలో ఒకటి ‘ఎనిమల్’. ‘అర్జున్ రెడ్డి’ మరియు ‘కబీర్ సింగ్’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ నుండి వచ్చిన సినిమా ఇది. మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా, తెలుగు లో కూడా అద్భుతంగా ఆడింది. ప్రపంచవ్యాప్తంగా అన్నీ భాషలకు కలిపి 900 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది.

ఈ రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన ఈ సినిమా అంటే నచ్చనోళ్లు కూడా చాలా మంది ఉన్నారు. కారణం సినిమాలో హీరో మరియు హీరోయిన్ చాలా బోల్డ్ గా కనిపించడమే. ప్రముఖ సెలబ్రిటీస్ సైతం ఇదొక సినిమానా అంటూ ఇష్టమొచ్చినట్టు తిట్టసాగారు. ఓటీటీ అన్న తర్వాత కచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ సహజ సిద్ధంగా కొత్తగా అప్లోడ్ అయ్యే సినిమాలను చూస్తారు.

ఫ్యామిలీ ఆడియన్స్ అలా ఇలాంటి సినిమాలు చూసినప్పుడు రియాక్షన్ ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. మనం ఊహించుకున్న రియాక్షన్ కంటే దారుణంగా ఓటీటీ విడుదల తర్వాత వచ్చింది ఈ సినిమాకి. అలా ఈ సినిమాని చూసి కంగుతిన్న వారిలో ఒకడు మెగాస్టార్ చిరంజీవి. రీసెంట్ గానే సందీప్ వంగ చిరంజీవి కి పద్మవిభూషణ్ అవార్డు వచ్చిన కారణంగా, ఆయన ఇంటికి వెళ్లి, కలిసి అభినందనలు తెలిపి పుష్ప గుచ్చం అందించాడు. ఆ తర్వాత కాసేపు సందీప్ వంగ తో చిరంజీవి ‘ఎనిమల్’ చిత్రం గురించి మాట్లాడాడు. ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసే రేంజ్ బ్లాక్ బస్టర్ ని కొట్టినందుకు సందీప్ వంగ కి అభినందలు తెలియచేసిన మెగాస్టార్, ఈ సినిమా కారణంగా తనకి ఎదురైనా ఒక వింత అనుభూతిని పంచుకున్నాడు. చిరంజీవి సతీమణి సురేఖ కి ఓటీటీ లో విడుదలయ్యే బ్లాక్ బస్టర్ సినిమాలను చూడడం అలవాటు అట.

అలా ఆమె తన అత్తగారితో కలిసి ఈ ఎనిమల్ చిత్రం చూసిందట. కొన్ని సన్నివేశాలకు ఆమె బండ బూతులు తిట్టిందట. ఈ విషయాన్ని చిరంజీవి సందీప్ తో పంచుకున్నాడు. ఫ్యామిలీ ఆడియన్స్ ఇబ్బంది పడే విధమైన సన్నివేశాలు తియ్యడం ఇప్పటి నుండి అయినా మానుకో అయ్యా, నా అభిమాని అంటున్నావ్, నాతో సినిమా చేస్తాను అంటున్నవ్, ఇలాంటి సన్నివేశాలు పెడితే నా అభిమానులు నిన్ను ఇంటికి వచ్చి మరీ కొడుతారు అంటూ చెప్పుకొచ్చాడట చిరంజీవి.

TAGS