Klin Kara Face Revel : మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన 39వ పుట్టిన రోజు సందర్భంగా శ్రీ గోవిందుడి దర్శనం చేసుకున్నారు. నమో వేంకటేశాయా అంటూ తిరుమల స్వామి వారిని వేడుకున్నారు. స్వామి వారి ఆశీర్వాదం కోసం తన భార్య ఉపాసన, కూతురు క్లిన్ కారాతో తిరుమల వచ్చారు. స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. ఆలయ వేదికకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పటికే వైరల్ అయ్యాయి.
రామ్ చరణ్, ఉపాసన సంప్రదాయ దుస్తులతో ఆలయ క్యూ లైన్లు, పరిసరాలలో తిరిగారు. రామ్ చరణ్ కూతురు క్లిన్ కారాను తల్లి ఉపాసన ఎత్తుకుంది. వారు క్యూలైన్ లో వెళ్తున్న సమయంలో క్లిన్ కారా ఫేస్ కొంచెం కనిపించింది. వెంటనే ఉపాసన కూతురు ముఖంపై తన చెంగును కప్పింది. క్లిన్ కారా ఫేస్ కనిపించడంలో ఫ్యాన్స్ షేర్ చేస్తూ లైక్ చేస్తున్నారు. వెబ్ మీడియాతో పాటు యూ ట్యూబ్ లో కనిపించడంతో క్లిన్ కారా బ్యూటీ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
రామ్ చరణ్ పుట్టిన రోజు నాడు ఏదైనా దేవాలయం వెళ్లడం చేస్తుంటారు. ఇందులో భాగంగానే ఈసారి తిరుమల వచ్చినట్లు జంట చెప్పుకుంటుంది. ఈ సారి పుట్టిన రోజు ఆయనకే కాకుండా ఆయన ఫ్యాన్స్ కు స్పెషల్ గా ఉంది. ఎందుకంటే కొంచెం వరకైనా క్లిం కారా ఫేస్ కనిపించింది.
ఇక సినిమాల విషయానికి వస్తే రామ్ చరణ్ డైరెక్టర్ శంకర్ కాంబోలో వస్తున్న ‘గేమ్ ఛేంజర్’ దాదాపుగా పూర్తయ్యింది. తన తర్వాతి చిత్రం ఉప్పన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రాబోతోంది. దీనికి మొన్ననే ముహూర్తం షాట్ కూడా తీశారు. వేగంగా షూటింగ్ కు వెళ్తుంది. వీటితో పాటు నిన్న హోలీ రోజు సుకుమార్ తో #RC17 ప్రకటించారు. ఇది వచ్చే ఏడాది చివరికి రిలీజ్ అయ్యేలా షెడ్యూల్ చేసుకోనున్నారు.