Ram Charan-Pawan : 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన జనసేన అధినేత పవన్ కల్యాన్ 2024 ఎన్నికల్లో మరింత దూకుడుగా ముందుకు పోతున్నారు. రాజకీయాల నుంచి తప్పుకోలేదు. ఒటమి నుంచి పాఠం నేర్చుకుంటూ ముందుకు సాగుతున్నారు. అలాగే గత ఎన్నికల్లో సినిమా ఇండస్ట్రీ నుంచి పవన్ కల్యాన్ వెంట వచ్చిన వారూ తక్కువే.
జబర్దస్త్ కమెడియన్ల నుంచి నిర్మాతల వరకు
ఈసారి ఎన్నికల్లో పవన్ కల్యాన్ కు తోడుగా ఫిలిం ఇండస్ర్టీ నుంచి ఎంతో మంది నేరుగా మద్దతు తెలుపుతున్నారు. వారాహి యాత్ర మొదటి విడుతలో నే ప్రముఖ నిర్మాత జనసేనలో చేరాడు. అప్పటికే జబర్దస్త్ టీమ్ నుంచి ఆది, ఆటో రాం ప్రసాద్, సుధీర్, గెటప్ శ్రీను, రచ్చ రవి తదితర జబర్దస్త్ టీమ్ అంతా పవన్ వెంట నడుస్తున్నది. వైసీపీలో ఉన్నప్పుడు పవన్ కల్యాన్ పై ఎన్నో విమర్శలు చేసిన క్యారెక్టర్ ఆర్టిస్ట్, కమెడియన్ పృథ్వీరాజ్ సైతం పవన్ కు మద్దతు పలికారు. తన తప్పు తెలుసుకున్నానని పలు ఇంటర్వ్యూల్లోనూ చెప్పారు పృథ్వీరాజ్.
మెగాస్టార్ సపోర్ట్ తో మారిన సీన్
జనసేన ఆవిర్భావం నుంచి పవన్ కల్యాన్ కు మద్దతు ఇస్తూ వస్తున్నారు నటుడు, నిర్మాత, మెగా సోదరుడు నాగబాబు. తమ్ముడి పొలిటికల్ గ్రౌండ్ వర్క్ అంతా నాగబాబే చూసుకుంటున్నారు. తమ్ముడిపై విమర్శలు చేస్తున్న వారికి సోషల్ మీడియా లో నేరుగా కౌంటర్లు వేస్తున్నారు మెగా బ్రదర్. ఇక మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు కౌలు రైతుల కోసం పడుతున్న తపనను చూసి చలించిపోయార. విశ్వంభర సెట్ లో భారీ విరాళం సైతం అందించారు. దీంతో సినిమా ఇండస్ర్టీ నుంచి పవన్ కు మద్దతిచ్చే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది.
తన కుటుంబ సభ్యులను పవన్ కు మద్దతు ఇవ్వాలని బహిరంగంగానే చెప్పారు మెగా స్టార్. ఇప్పటికే హీరోలు, మేనల్లుళ్లు సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ పాటు నాగబాబు కుమారుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా ఇప్పటికే క్యాంపెయిన్ చేస్తున్నారు. మే 7న తన తమ్ముడికి మద్దతు ఇవ్వాలంటూ మెగా స్టార్ చిరంజీవి ఓ వీడియో కూడా రిలీజ్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో నాచురల్ స్టార్ నాని, హీరో తేజా సజ్జా, రాజ్ తరుణ్ పవన్ కు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
మెగా స్టార చిరంజీవి వీడియోని మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ‘ మీ భవిష్యత్తు కోసం పాటుపడే లీడర్ పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేసి గెలిపించండి’ అని ట్విట్టర్(ఎక్స్) లో కోరాడు. ప్రస్తుతం చరణ్ చేసిన ట్వీట్ సోష్ మీడియాలో వైరల్ గా మారింది. బాబాయ్ కోసం అబ్బాయ్ అంటూ మెగా హీరోల అభిమానులు, జనసైనికులు కామెంట్లు పెడుతున్నారు.