JAISW News Telugu

Game Changer : శంకర్‌పై మెగా ఫ్యాన్స్ ట్రోల్.. గేమ్ ఛేంజర్‌ కూడా అలా అవబోతుందా?

Game Changer

Game Changer

Game Changer : ఇండియా గర్వించదగ్గ డైరెక్టర్లలో శంకర్ ఉంటారు. సామాజిక బాధ్యతకు కమర్షియల్ హంగులను అద్ది ఫిల్మ్ మేకింగ్ ను పూర్తిగా మార్చిన డైరెక్టర్ అతను. జెంటిల్‌మెన్ నుంచి భారతీయుడు 2 వరకు ఒకటే ఫార్ములాతో సినిమాలు తీసి బ్లాక్‌ బస్టర్లు కొట్టారు శంకర్. తీసింది తక్కువ సినిమాలే అయినా.. తరతరాలు చెప్పుకునే పేరును సంపాదించుకున్నారు. హీరోలు రాజ్యమేలే ఇండస్ట్రీల్లో దర్శకుడికి స్టార్‌ స్టేటస్‌ను తెచ్చిన అరుదైన డైరెక్టర్.

సోషల్ ఎలిమెంట్స్‌ను టచ్ చేస్తూ జనాలకు బోర్ కొట్టకుండా మూవీస్ ను తీయడంలో ఇతని స్టయిల్ వేరని చెప్పవచ్చు. కానీ.. శంకర్ దీనికి కమర్షియల్ హంగులను అద్ది మాస్ అండ్ క్లాస్ ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేశారు. శంకర్ సినిమాల్లో సామాజిక అంశాలతో పాటు దేశబక్తి, జాతీయతా అనే భావం కనిపిస్తుంది. అవినీతి, లంచగొండితనంపై శంకర్ చేసిన చిత్రాలు ఆయన ఖ్యాతిని దశ దిశలకు చేరాయి. కోయంబత్తూరులో పుట్టిన శంకర్.. నటుడు కావాలనే కోరికతో మద్రాస్ లో అడుగుపెట్టారు. కానీ విధి ఆయనను దర్శకత్వం వైపు నడిపించింది.

తమిళ అగ్ర నటుడు, ఇళయదళపతి విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ వద్ద ఓనమాలు నేర్చుకున్నాడు. జెంటిల్‌మెన్‌తో మెగాఫోన్ పట్టుకొని డైరెక్టర్‌గా మారాడు. రొటీన్ రాబిన్‌హుడ్ స్టోరీని కొత్తగా తెరకెక్కించి సూపర్ హిట్ కొట్టారు. అనంతరం ప్రేమికుడు, భారతీయుడు, జీన్స్, ఒకే ఒక్కడు, అపరిచితుడు, శివాజీ, రోబో, ఐ, రోబో2.O వంటి విజువల్ వండర్స్‌ను చిత్ర పరిశ్రమకు అందజేశారు. థింక్ బిగ్ అన్నదే తన సక్సెస్ స్టోరీ అంటారు శంకర్. రోబోట్స్ అనేవి మానవాళిని అంతం చేయగలవని రోబోలో చూపించారు. యంత్రానికి ఆలోచించే శక్తి వస్తే వినాశనం తప్పదని స్క్రీన్‌పై చూపించాడు.

మారుతున్న సినీ ఆడియన్స్ అభిరుచిని కాకుండా తనదైన శైలిలో సినిమాలు చేయడం వల్ల శంకర్‌ ఆడియన్స్‌తో ఉన్న కనెక్టీవిటీ కోల్పోతున్నాడా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇండియన్ 2 చూసిన తర్వాత అత్యంత అవుట్ డేటెడ్ సబ్జెక్ట్ చేశాడేంటి..? కథలో దమ్ము లేదు. స్క్రీన్ ప్లే దారుణంగా ఉంది. శంకర్ అంటే పాటలు గ్రాండియర్‌గా ఉంటాయి. కానీ ఇండియన్ 2లో పాటలే సరిగా లేవు. ఇలా చేస్తే ‘గేమ్ ఛేంజర్’ పరిస్థితి ఏంటనే అనుమానాలను మెగా ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు.

శంకర్‌ టాలెంట్‌తో సంబంధం లేకుండా ‘గేమ్ ఛేంజర్’ కేవలం రామ్ చరణ్ స్టామినాపైనే నడుస్తుంది. ‘వినయ విధేయ రామ’ డిజాస్టర్ అయినా రూ. 90 కోట్ల గ్రాస్ రాబట్టింది అనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. కథ కొంచం వరకు  బాగుంటే చాలూ ఆ సినిమాకు ఢోకా ఉండదు. ఇండియన్ 2 ఇంపాక్ట్ గేమ్ ఛేంజర్‌పై ఉండదు అనే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.

Exit mobile version