Lavanya Tripathi : ఆ స్టార్ హీరో కి తల్లిపాత్రలో నటించబోతున్న మెగా కోడలు లావణ్య త్రిపాఠి!
Lavanya Tripathi : సౌత్ ఇండియా లోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో ఒకరిగా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పేర్లు చెప్పొచ్చు. ‘మిస్టర్’ సినిమాతో పరిచయమైన వీళ్లిద్దరి స్నేహం ఆ తర్వాత ప్రేమగా మారింది. సుమారుగా 5 ఏళ్ళ పాటు డేటింగ్ కూడా చేసుకున్నారు. డేటింగ్ సమయం లో ఇక జీవితాంతం కలిసిమెలిసి ఉండగలం అని నమ్మకం వచ్చాక పెద్దలకు చెప్పి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు లావణ్య త్రిపాఠి మెగా కోడలు అయ్యింది.
మెగా కోడలు అంటే ఇండస్ట్రీ లో ఏ రేంజ్ స్థానం ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం లావణ్య త్రిపాఠి కూడా ఆ రేంజ్ ని ఎంజాయ్ చేస్తుంది. సోషల్ మీడియా లో ఈమధ్య ఎక్కడ చూసిన ఈమె పేరు మారుమోగిపోతూ ఉంది. అంతే కాకుండా రీసెంట్ గా ఈమె ‘మిస్ పర్ఫెక్ట్’ అనే వెబ్ సిరీస్ లో హీరోయిన్ గా నటించింది. ఈ వెబ్ సిరీస్ డిస్నీ + హాట్ స్టార్ లో ప్రసారం అవుతూ మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది.
పెళ్లి జరిగిన తర్వాత కూడా ఇంతకు ముందు లాగానే సినిమాలు, వెబ్ సిరీస్లు చేస్తాను అంటూ చెప్పుకొచ్చిన లావణ్య త్రిపాఠి రీసెంట్ గానే ఒక క్రేజీ ప్రాజెక్ట్ కి సంతకం చేసిందట. కాని ఈ ప్రాజెక్ట్ లో ఆమె హీరోయిన్ మాత్రం కాదు. ఒక క్రేజీ యంగ్ హీరో కి తల్లి పాత్ర పోషిస్తుందట. చూసేందుకు ఎంతో హాట్ గా కనిపించే లావణ్య త్రిపాఠి తల్లి పాత్ర పోషించడం ఏమిటి? అని మీకు అనిపించొచ్చు. కానీ ఆమె చేస్తుంది హీరో చిన్నప్పుడు ఉన్న సన్నివేశాలకు తల్లిపాత్ర అన్నమాట. ఇంతకీ ఎవరు హీరో?, డైరెక్టర్ ఎవరు ఏమిటి అనేది ఇంకా అధికారికంగా తెలియాల్సి ఉంది.
లావణ్య త్రిపాఠి ఇక నుండి రెగ్యులర్ హీరోయిన్ రోల్స్ కాకుండా, నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలు మాత్రమే చేస్తుందట. ఆమెకి ఎక్కువగా ఫిమేల్ ఓరియెంటెడ్ సబ్జక్ట్స్ లో మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ వస్తున్నాయట, రీసెంట్ గానే ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమాకి సంతకం చేసానని, ఇప్పటి వరకు మీరెవ్వరు చూడని షేడ్ ని ఈ సినిమాలో చూపించబోతున్నాను అంటూ లావణ్య త్రిపాఠి చెప్పుకొచ్చింది. అంతే కాకుండా భవిష్యత్తులో మీ భర్త వరుణ్ తేజ్ తో కలిసి సినిమా చేస్తారా అని అడగగా, కథ దొరికితే కచ్చితంగా చేస్తాను, అందులో సందేహం ఏముంది అని చెప్పుకొచ్చింది.