Mega christmas party:క్రిస్మస్ పార్టీ సరే.. ఆ ఇద్దరు మెగా హీరోల పెళ్లెపుడు?
Mega christmas party:మెగా కుటుంబం ఫుల్ చిల్లింగ్ మోడ్ లో ఉంది. పండుగల పబ్బాల వేళ పార్టీలతో ఏడాదంతా సందడే సందడి కనిపిస్తోంది. ప్రతియేటా సంక్రాంతి, దసరా, వినాయక చవితి, క్రిస్మస్ వంటి పండుగలను మెగా కుటుంబం అద్భుతంగా జరుపుకుంటుంది. ఇంటిల్లిపాదీ ఓ చోట చేరి సందడి చేయడంతో కన్నుల పండుగగా మారుతుంది. ఈ ఏడాది డిసెంబర్ ముగింపులో క్రిస్మస్ వేడుకలను అదే తీరుగా ఆనందంగా ఆహ్లాదంగా కన్నుల పండుగగా ముగించింది ఈ ఫ్యామిలీ.
నిన్న రాత్రి క్రిస్మస్ పార్టీలో చరణ్, అల్లు అర్జున్ వారి భార్యలు సహా విచ్చేయగా, ఇదే పార్టీలో వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి జంట సందడి చేసారు. నిర్మాత బన్ని వాస్ తన సతీమణితో కలిసి కనిపించారు. అయితే ఈ పార్టీ నైట్ లో ఇద్దరు బ్యాచిలర్స్ అందరి కళ్లను ఆకర్షించారు.
మెగా హీరోల్లో సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్ ఇద్దరూ ఇంకా బ్యాచిలర్స్ గా ఉన్నారు. ఆ ఇద్దరి పెళ్లి ఇంకెప్పుడు? అంటూ ఆసక్తికర డిబేట్ సాగుతోంది. చరణ్- ఉపాసన, బన్ని-స్నేహారెడ్డి, వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి జంటలు లైఫ్ లో సెటిలయ్యారు. మరి ఆ ఇద్దరూ సెటిలయ్యేదెపుడు? అన్న చర్చా సాగుతోంది.
సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ తర్వాత నెమ్మదిగా కోలుకుని తిరిగి సినిమాలు చేస్తున్నాడు. కానీ శిరీష్ సినిమాలకు దూరంగా తన బిజినెస్ లను నిర్వహిస్తున్నాడన్న సమాచారం ఉంది. ఈ ఇద్దరూ మెగా కాంపౌండ్ లో ఎలిజిబుల్ బ్యాచిలర్స్. తొందర్లోనే ఓ ఇంటి వారవ్వాలని మెగా ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.