JAISW News Telugu

Meenakshi Chaudhary : అక్కినేని ఇంటి కోడలు కాబోతున్న మీనాక్షి చౌదరి

Meenakshi Chaudhary

Meenakshi Chaudhary

Meenakshi Chaudhary  : మీనాక్షి చౌదరి ఇప్పుడు బిజీ హీరోయిన్. ‘లక్కీ బాస్కర్‌’తో ఆమెకు క్రేజ్‌ అమాంతం పెరిగింది. వరుణ్ తేజ్ తో ‘మట్కా’ విడుదలకు సిద్ధంగా ఉంది. విశ్వక్ సేన్ ‘మెకానిక్ రాకీ’లో కూడా ఆమె కథానాయిక. మరోవైపు వెంకటేష్‌తో కలిసి ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమా చేస్తోంది. ఈ సినిమా 2025 సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతుంది.. అందుకే మీనాక్షి ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉంది..!

ఇలాంటి సమయంలో సినిమాల మధ్య కాస్త గ్యాప్ తీసుకుని పెళ్లి చేసుకోవాలని ఏ హీరోయిన్ అనుకోదు. అయితే మీనాక్షి మాత్రం చేసుకుంటూ హల్ చల్ చేస్తోంది. ఇదిలా ఉంటే.. మీనాక్షికి సంబంధించిన ఓ వార్త గత 4-5 రోజులుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వివరాల్లోకి వెళితే.. మీనాక్షి చౌదరి తన మొదటి సినిమా హీరో సుశాంత్‌ను పెళ్లాడబోతుందనేది ఆ వార్తల సారాంశం.. త్వరలో నిశ్చితార్థం కూడా చేసుకోనుందని కొందరు కథనాలు సృష్టించారు. అయితే ఇందులో ఎంతమాత్రం నిజం లేదని మీనాక్షి చౌదరి బృందం చెబుతోంది.  సుశాంత్, మీనాక్షి.. మంచి స్నేహితులు. అంతేకాదు సుశాంత్ హీరోగా నటించిన ‘ఇచ్చట వాహనములు తూలరాదు’ సినిమాతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది.

Exit mobile version