Meenakshi Chaudhary:అక్కినేని హీరోతో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్!
Meenakshi Chaudhary:’ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన హీరోయిన్ మీనాక్షి చౌదరి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. రీసెంట్ గా ‘లక్కీ భాస్కర్’తో మంచి హిట్ అందుకుంది. అయితే ఈ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. రీసెంట్ గా వచ్చిన ‘మట్కా’ సినిమా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇది కాకుండా.. త్వరలో ‘మెకానిక్ రాకీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు విశ్వక్ సేన్. వరుస సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తున్న మీనాక్షి చౌదరి పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దానికి కారణం అక్కినేని ఫ్యామిలీ నుండి వచ్చిన హీరో సుశాంత్‌ని ఈ బ్యూటీ పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు గత రెండు రోజులుగా హల్చల్ చేస్తున్నాయి.
ఈ పుకార్లపై మీనాక్షి చౌదరి బృందం స్పందిస్తూ.. ‘అవన్నీ తప్పుడు వార్తలు. ఇద్దరూ మంచి స్నేహితులు. వాళ్లు పెళ్లి చేసుకోబోతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. అయితే.. సుశాంత్ ‘ఇచ్చట వాహనములు ఆపరాదు’ సినిమాతో మీనాక్షి చౌదరిని కలిశాడు. అప్పటి నుంచి వారిద్దరూ మంచి స్నేహితులుగా ఉన్నారని తెలుస్తోంది. పెళ్లిపై రూమర్స్ బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ విషయంపై మీనాక్షి చౌదరి టీమ్ స్పందించి ఈ రూమర్లకు క్లారిటీ ఇచ్చింది.
ఎట్టకేలకు ఓ మీటింగులో ఈ రూమర్లపై మీనాక్షి చౌదరి స్పందించిందని తెలుస్తోంది. ‘ప్రస్తుతానికి నేను సింగల్ గా ఉన్నాను. త్వరలో పెళ్లి చేసుకునే ఆలోచన కూడా లేదు. ప్రతి నెలలో నాకు కొత్త రిలేషన్ షిప్ లేదా కొత్త సినిమా గురించి రూమర్స్ పుట్టించడం సర్వసాధారణం అయిపోయింది’ అని మీనాక్షి చెప్పిందట. తద్వారా తన పెళ్లిపై వస్తోన్న పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టిందీ అందాల తార.