JAISW News Telugu

PM Modi : త్వరలో హిందీ సహా పలు భారతీయ భాషల్లో వైద్యవిద్య: పీఎం మోదీ

PM Modi

PM Modi

PM Modi : త్వరలోనే హిందీ సహా పలు భారతీయ భాషల్లో వైద్యవిద్ అందుబాటులోకి వస్తుందని పీఎం నరేంద్ర మోదీ అన్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా లక్ష మెడికల్ సీట్లు ఉన్నాయని, రాబోయే ఐదేళ్లలో మరో 75 వేల మెడికల్ సీట్లు అందుబాటులోకి తీసుకొస్తామని పీఎం హామీనిచ్చారు. దేశంలో 1.5 లక్షలకు పైగా ఉన్న ‘ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు’ బడుగు బలహీనవర్గాలకు మెరుగైన సేవలందిస్తున్నాయని తెలిపారు. దేశంలో దాదాపు నాలుగు కోట్ల మంది ప్రజలు దీని ద్వారా ప్రయోజనం పొందుతున్నారని తెలిపారు. బిహార్ లోని దర్భంగాలో నిర్వహించిన సభలో పీఎం ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో భాగంగా దర్భంగాలో ఎయిమ్స్ కు ప్రధాని శంకుస్థాపన చేసి రూ.12,100 కోట్ల విలువైన ప్రాజెక్టులను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా నితీశ్ కుమార్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రధాని కొనియాడారు. ఆటవిక రాజ్యంగా ఉన్న రాష్ట్రాన్ని సీఎం అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వాలు కేవలం తప్పుడు వాగ్దానాలు మాత్రమే చేశాయని, కానీ రాష్ట్రంలో నితీశ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మెరుగుపడిందని పేర్కొన్నారు.

Exit mobile version