President Draupadi Murmu : మీడియా ధైర్యంగా పనిచేయాలి : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

President Draupadi Murmu
ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా.. ఎవరికీ భయపడకుండా ప్రజలకు నిజాలు తెలియజేయాలని అన్నారు. దేశాన్ని, సమాజాన్ని సక్రమంగా తీర్చిదిద్దటంలో ఫోర్త్ ఎస్టేట్ పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. మీడియా ఎల్లప్పుడూ సత్యానికే అండగా ఉండాలన్నారు. సత్యం మార్గం నుంచి పక్కకు వెళ్ళొద్దని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచించారు. దేశానికి వచ్చిన కొద్ది రోజుల్లోనే మొదలైన పిటిఐ ప్రయాణం భారత జర్నలిజంల్ అనివార్యంగా మారిందని రాష్ట్రపతి అభినందించారు.