Loksabha Elections 2024 : 2024 లోక్ సభ ఎన్నికల్లో గెలిచేదెవరో తేల్చిన మీడియా సంస్థలు.. నిజమెంత ?

Loksabha Elections 2024

Loksabha Elections 2024

Loksabha Elections 2024 : దేశ వ్యాప్తంగా ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. ఇప్పటికే నాలుగు దశల్లో పోలింగ్ పూర్తయింది. రేపు ఐదో దశ పోలింగ్ జరుగనుంది. తెలంగాణలో 13వ తేదీన లోక్ సభ ఎన్నికలు పూర్తయ్యాయి. వాటి ఫలితాలను తెలుసుకోవాలని అందరూ ఆసక్తిగా ఉన్నారు. ఎన్నికలు పూర్తి కాగానే India Today, Times Now, Chanakya సంస్థలు రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదల చేశాయని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. వాటిలో నిజమెంతో చూద్దాం.
 
క్లెయిమ్ :  India Today, Times Now, Chanakya సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి.

ఫాక్ట్(నిజం): ఎన్నికల సంఘం 19 ఏప్రిల్ 2024 నుంచి ఉదయం 7 గంటల నుంచి జూన్ 01 సాయంత్రం 6:30 గంటల వరకు ఎలాంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలను ప్రకటించడాన్ని నిషేధించింది. తెలంగాణ లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి 15 మే 2024వరకు India Today, Times Now, Chanakya సంస్థలు ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయలేదు. కావున సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతున్న పోస్టులు తప్పు. ఎగ్జిట్ పోల్స్ ప్రచురణకు సంబంధించిన నియమాలు THE REPRESENTATION OF THE PEOPLE ACT , 1951 సెక్షన్ 126A లో పొందుపరిచారు. దాని ప్రకారం ఎన్నికల సంఘం చెప్పినట్లు ఎగ్జిట్ పోల్స్ నిర్వహించడం కానీ వాటి ఫలితాలని బహిర్గతం చేయడం కానీ నిషిద్ధం.

16 మార్చి 2024న ఎన్నికల సంఘం విడుదల చేసిన 2024 లోక్ సభ, ఆంధ్రప్రదేశ్ సహా మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం, “ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 126A, నిర్ధిష్ట కాలంలో ఎగ్జిట్ పోల్ నిర్వహించడాన్ని, దాని ఫలితాలను ప్రింట్ లేదా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రసారం చేయడాన్ని నిషేధిస్తుంది. అలా చేస్తే రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధిస్తారు.  దేశంలోని అన్ని లోక్‌సభ స్థానాలకు పోలింగ్ ముగేసేవరకు ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయడానికి వీలులేదు.  

 భారత ఎన్నికల సంఘం ట్విట్టర్లో 19 ఏప్రిల్ 2024న ఇదే విషయాన్ని తెలియజేస్తూ పోస్ట్ చేసింది. వార్తా పత్రికలు కూడా భారతదేశ ఎన్నికల సంఘం 19 ఏప్రిల్ 2024 ఉదయం 7 గంటల నుంచి 01 జూన్ 2024 సాయంత్రం 6:30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ నిషేధించడాన్ని గురించి రిపోర్ట్ చేశాయి. 2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి 15 మే 2024 వరకు India Today, Times Now, Chanakya సంస్థలు ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయలేదు.

TAGS