Medaram Jathara : సమ్మక్క సారక్కలకు ప్రణమిల్లుదాం.. మేడారం జాతరపై మోదీ ట్వీట్ వైరల్

Medaram Jathara

Medaram Jathara

Medaram Jathara PM Modi Tweet : ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర, తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన మేడారం మహా జాతర రేపు ప్రారంభం కాబోతోంది. రాష్ట్రం నుంచే కాకుండా దేశవ్యాప్తంగా కోట్లాది భక్తులు సమ్మక్క సారలమ్మల దర్శనానికి రానున్నారు. ఇప్పటికే 60లక్షలకు పైగా తల్లులను దర్శించుకోగా, జాతర జరిగే ఈ మూడు రోజులు కోటిన్నర భక్తులకు పైగా రానున్నారు. బుధవారం సారలమ్మ రాకతో జాతర మొదలవుతుంది. గురువారం సమ్మక్క ఆగమనంతో మహాజాతర తారాస్థాయికి చేరిపోతోంది. ఆ తర్వాతి రోజు శుక్రవారం గద్దెల పై ఇద్దరు అమ్మవార్లకు మొక్కులు ఉంటాయి. అనంతరం వనప్రవేశం ఉంటుంది.

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను ఉద్దేశిస్తూ ట్విటర్ వేదికగా దేశ ప్రజలకు తెలుగులో సందేశం పంపించారు. ‘గిరిజనుల అతిపెద్ద పండుగ, మన సాంస్కృతిక వారసత్వానికి చిరకాల స్ఫూర్తిగా నిలిచే సమ్మక్క, సారక్క మేడారం మహా జాతర ప్రారంభోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. ఈ జాతర భక్తి, సంప్రదాయం, సమాజ స్ఫూర్తిల గొప్ప కలయిక. మనం సమ్మక్క సారక్కలకు ప్రణమిల్లుదాం, వారు అభివ్యక్తీకరించిన ఐక్యతా స్ఫూర్తిని, పరాక్రమాన్ని గుర్తుచేసుకుందాం.’’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సమ్మక్క సారక్క జాతరపై ప్రధాని మోదీ ట్వీట్ చేయడంపై తెలంగాణ నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే జాతరకు జాతీయ హోదా కల్పించమని పదేళ్లుగా డిమాండ్ చేస్తున్న ఇప్పటివరకు ఆ దిశగా పురోగతి లేదు. కనీసం ఈ జాతరను పురస్కరించకుని మేడారం మహాజాతరకు జాతీయ కల్పించాలని తెలంగాణ బిడ్డలు కోరుతున్నారు.

TAGS