Medaram Jatara : రెండేళ్లకోసారి వచ్చే గిరిజన కుంబమేళాగా పిలవబడే సమ్మక్క-సారలమ్మ జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచే కాక పొరుగు తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, ఒడిస్సా, తదితర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారు. అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. దీంతో మేడారం జన సంద్రంగా మారుతుంది.
బుధవారం (ఫిబ్రవరి 21)న పగిడిద్ద రాజు, జంపన్న, సారలమ్మ గద్దెలపైకి వచ్చారు. నేడు (ఫిబ్రవరి 22) సమ్మక్క గద్దెలపైకి రాగా.. ఫిబ్రవరి 23 (శుక్రవారం) పెద్ద ఎత్తున జాతర జరుగుతుంది. ములుగు జిల్లా, తాడ్వాయి మండలంలోని శ్రీమేడారం సమ్మక్క-సారలమ్మ జాతర 24న జాతర ముగుస్తుంది.
అయితే, ములుగు జిల్లాలోని స్కూల్స్, కాలేజీలకు కలెక్టర్ ఇలా త్రిపాఠి నాలుగు రోజులు సెలవు ప్రకటించారు. ఆదివారం కూడా హాలీడే కావడంతో వరుసగా ఐదు రోజులు సెలవులు వస్తున్నాయి. 2014లో రాష్ట్ర పండువగా గుర్తించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క రోజైనా సెలవు ప్రకటించాలని సీఎంకు వినతులు వస్తున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం ఎలాంటి ప్రకటన జారీ చేయలేదు. ఎలాంటి డిషిజన్ తీసుకోలేదు.
21వ తేదీ నుంచి ప్రారంభం కానున్న జాతరకు కోటికి పైగా భక్తులు రానున్నారు. రాష్ట్రం నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు.
జాతర నేపథ్యంలో జిల్లాలో ఫిబ్రవరి 21, 22, 23, 24 ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలతో పాటు కార్యాలయాలకు కూడా పని చేయవని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఫిబ్రవరి 25 ఆదివారం కూడా సెలవు. తిరిగి పాఠశాలలు, కార్యాలయాలు 26 సోమవారం ప్రారంభమవుతాయని కలెక్టర్ చెప్పారు.