JAISW News Telugu

Pawan orders : పవన్ ఆదేశాలతో కదిలిన యంత్రాంగం.. సరస్వతి పవర్ భూముల్లో సర్వే

Pawan orders

Pawan orders

Pawan orders : జగన్-షర్మిల ఆస్తుల పంపకం వ్యవహారంలో సరస్వతి పవర్ సంస్థ పేరు తెరపైకి వచ్చింది. పల్నాడు జిల్లా దాచేపల్లి వద్ద ఈ సంస్థకు చెందిన 1,515 ఎకరాల భూముల్లో అటవీ భూములు కూడా ఉన్నాయని కథనాలు వచ్చాయి. దీంతో రాష్ట్ర డిప్యూటీ సీఎం, అటవీశాఖ మంత్రి పవన్ కల్యాణ్ సరస్వతి పవర్ సంస్థకు చెందిన భూముల్లో ఎంత మేర అటవీ భూములు ఉన్నాయో పూర్తి వివరాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

ఈ నేపథ్యంలో శనివారం (అక్టోబరు 26) అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. పల్నాడు జిల్లా దాచేపల్లి, మాచవరం మండలాల్లోని సరస్వతి పవర్ సంస్థకు చెందిన భూముల్లో అధికారులు సర్వే చేపట్టారు. దాచేపల్లి డీఆర్వో ఆధ్వర్యంలో అటవీశాఖ సిబ్బంది ఈ సర్వేలో పాల్గొన్నారు. సర్వే అనంతరం అటవీశాఖ అధికారులు సమగ్ర నివేదిక రూపొందించి మంత్రి పవన్ కల్యాణ్ కు అందించనున్నారు.

Exit mobile version