Mechanic Rocky Review : మెకానిక్ రాకీ రివ్యూ : మెకానిక్ రాకీ హిట్టా.. ఫట్టా
Mechanic Rocky Review : హిట్టు ప్లాఫులతో వరుసగా సినిమాలు చేస్తున్నాడు మాస్ కా దాస్ విష్వక్ సేన్. ఆయన హీరోగా తాజా చిత్రం మెకానిక్ రాకీ. నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ట్రైలర్, టీజర్లతో ఆకట్టుకున్న ఈ మెకానిక్ రాకీ థియేటర్లలో ప్రేక్షకులను ఏ మేరకు అలరించాడో తెలుసుకుందాం. మరి విష్వక్ సేన్ సినిమా ఎలా ఉంది? మరి అతని ఖాతాలో హిట్ పడిందా లేదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం
ఇదీ కథ..
నగుమోము రాకేశ్ అలియాస్ రాకీ (విశ్వక్ సేన్) బీటెక్ మధ్యలోనే వదిలేస్తాడు. తండ్రి రామకృష్ణ (వీకే నరేశ్ ) ఓ గ్యారేజ్ నడుపుతుంటాడు. చదువు అబ్బని రాకీ అదే గ్యారేజీలో మెకానిక్‌గా పని చేస్తుంటాడు. గ్యారేజీలో రిపేర్లు చేయడంతో పాటు రాకీ డ్రైవింగ్ కూడా నేర్పిస్తుంటాడు. అయితే డ్రైవింగ్ నేర్చుకోవడానికి మాయ (శ్రద్ధా శ్రీనాథ్), ప్రియ (మీనాక్షి చౌదరి) రాకీ దగ్గరకు వస్తారు. రాకీ బీటెక్ చదివే సమయంలో ప్రేమించిన అమ్మాయి ప్రియ. తన స్నేహితుడి చెల్లెలు కూడా. వీళ్లిద్దరి మధ్య లవ్‌ట్రాక్ మొదలవుతుంది అనుకునేలోగా కొన్ని కారణాలతో రాకీ కాలేజీ మానేయాల్సి వస్తుంది. చాలా రోజుల తర్వాత మళ్లీ ప్రియ కలిసిన తర్వాత రాకీకి ఆమె గురించి కొన్ని విషయాలు తెలుస్తాయి. మరి తెలుసుకున్న రాకీ… ప్రియ కోసం ఏం చేశాడు? వాళ్లిద్దరి మధ్యలోకి వచ్చిన మాయ వారి జీవితాలను ప్రభావితం చేసింది? తర్వాతే ఏం జరిగింది అనే విషయాలు తెలుసుకోవాలంటే మిగతా సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ ..
సినిమా మొదట్లో ఇదో ముక్కోణపు ప్రేమ కథలా అనిపిస్తుంది. సినిమా ప్రారంభంలోని సన్నివేశాలు రొమాంటిక్ కామెడీని తలపిస్తాయి. అయితే ఆ తర్వాత ఒక్కసారిగా సినిమా జానర్ మారిపోతుంది. కథలో ఇంకేదో ఉందన్న అనుమానాలను రేకేత్తిస్తుంది. సినిమాపై మరింత ఆత్రుతను పెంచుతుంది. కమర్షియల్ హంగులు కాస్త ఎక్కువే దట్టించారు. కానీ ఒక క్రైమ్బ్యాక్డ్రాప్తో సాగే కథ ఇది. పక్కా థ్రిల్లర్ కంటెంట్ఉన్న కథ ఇది. ఇప్పటి ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే అంశం ఇందులో ఉంది. చాలావరకు సీరియస్ ఎలిమెంట్స్ ఉన్న ఈ సినిమాలో కమర్షియల్ ఎక్కువ ఇరికించడంతో కథనంలో పట్టసడలింది. దీంతో కథలో గాఢత డైవర్ట్ అయినట్లు అనిపిస్తుంది. కామెడీ ట్రాక్, పాటల మధ్య ప్రథమార్తం సాగుతుంది తప్ప కథ ముందుకు కదలదు. దీంతో పాత్రల బిహేవియర్ నుంచి కథలోని ట్విస్ట్‌ల వరకూ ఏవీ అంత సహజంగా అనిపించవు. దీంతో ఆడియన్స్ సినిమాలో అంతగా లీనం కాలేడు. కామెడీ ట్రాక్ కూడా అంతగా ప్రభావం చూపలేకపోయింది. ఇక విష్వక్ సేన్ ఓల్డ్ గెటప్‌లో కనిపించి కాస్త సందడి చేశాడు.
ద్వితీయార్థమే ఈ సినిమాకి బలం. అనూహ్య మలుపులు ప్రేక్షకుడిలో ఆసక్తిని పెంచుతాయి. ప్రతి పాత్ర కూడా ఓ ట్విస్ట్ఇస్తుంటుంది. దీంతో కథనంలో వేగం పెరుగుతుంది. ప్రథమార్థంలో నొసలు చిట్లించుకున్న ప్రేక్షకులు ద్వితీయార్థంలో మాత్రం బాగా ఎగ్జైట్ అవుతారు. మధ్య తరగతి వాళ్ల ఆశలు, అవసరాలను ఆసరాగా చేసుకుని కొంతమంది చేసే మోసాలను ఈ సినిమాలో చాలా చక్కగా చూపించారు. కథనంతో కట్టిపడేసేందుకు దర్శకుడు ప్రయత్నించాడు. అయితే, ఎమోషనల్ కోణాన్ని మరింత ఎలివేట్ చేయాల్సింది. కొన్ని ట్విస్టులు ప్రేక్షకులకు థ్రిల్‌ని కలిగిస్తాయి.
ఎవరెలా చేశారంటే :
విష్వక్సేన్ ఎప్పటిలాగే తనకు అలవాటైన పాత్రలో మరోసారి కనిపించాడు. తన హుషారైన నటనతో తన క్యారెక్టర్ ను చక్కగా పండించాడు. హీరోయిన్లు శ్రద్ధా శ్రీనాథ్, మీనాక్షి చౌదరిలకు మంచి క్యారెక్టర్లు పడ్డాయి. ముఖ్యంగా శ్రద్ధా శ్రీనాథ్ పాత్ర ప్రేక్షకులకు సర్ ప్రైజింగ్ గా ఉంటుంది. నరేశ్వీకే , సునీల్, హర్షవర్ధన్, రోడీస్ రఘు, హర్ష చెముడు తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.
టెక్నికల్ పరంగా కూడా చాలా హై వాల్యూస్ మెయింటెన్ చేశారు. జేక్స్ బిజోయ్ ఈ సినిమాను టెర్రిఫిక్ బీజీఎం ఇచ్చాడు. ఫొటోగ్రఫీ కూడా బాగుంది. ప్రథమార్థంలో కాస్త ట్రిమ్ చేసి ఉంటే సినిమా మరింత ఆసక్తికరంగా ఉండేది. దర్శకుడు రవితేజ ముళ్లపూడి ఎంచుకున్న స్టోరీ, రచన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఎమోషనల్ యాంగిల్‌ను ఇంకాస్త పెంచి ఉంటే మరింత బాగుండేది.
సానుకూలాంశాలు..
విష్వక్సేన్ నటన
కథలో ట్విస్టులు
ద్వితీయార్ధం, బీజీఎం
ప్రతికూలాంశాలు
కామెడీ ట్రాక్
ఫస్ట్ హాఫ్ లో ఎడిటింగ్ లోపం
రేటింగ్ : 2.8/5
చివరిగా : మాస్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చతుంది.