Minister Nara Lokesh : మంత్రి నారా లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరిన ఏలూరు మేయర్

Minister Nara Lokesh
Minister Nara Lokesh : మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్ దంపతులు టీడీపీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి మంత్రి లోకేశ్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికల్లో ఓటమి నుంచి వైసీపీ గుణపాఠం నేర్చుకోలేదని, ప్రజా ప్రభుత్వంపై నిత్యం దుష్ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని అన్నారు. అనంతరం ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ఏలూరు అభివృద్ధి కోసం కలిసి వచ్చేవారికి స్నేహహస్తం అందిస్తున్నామని చెప్పారు. అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేవారిని టీడీపీలో చేర్చుకుంటున్నామని, త్వరలోనే దశల వారీగా కార్పొరేటర్లు టీడీపీలో చేరబోతున్నారని అన్నారు.
ఈ సందర్భంగా ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్ మాట్లాడుతూ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో టీడీపీని వీడి వైసీపీకి వెళ్లామన్నారు. ఆ పార్టీలోకి వెళ్లాక ఏమాత్రం అభివృద్ధి చేయలేకపోయామని, దాదాపు 40 మంది కార్పొరేటర్లు త్వరలోనే టీడీపీలో చేరనున్నారని తెలిపారు.