Akash Anand : మాయావతి రాజకీయ వారసుడు ఆకాష్ ఆనంద్..

Akash Anand
Akash Anand : బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి తన రాజకీయ వారసుడిగా తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్ ను మరోసారి ప్రకటించారు. జూన్ 23న ఆనంద్ ను బీఎస్పీ జాతీయ సమన్వయకర్తగా నియమించి తన రాజకీయ వారసుడిగా ప్రకటించారు మాయావతి. అనంతరం ఆకాష్ ఆనంద్ మాయావతి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు.
మాయావతి తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్ ను 2023 డిసెంబర్ లో తన రాజకీయ వారసుడిగా ప్రకటించారు. అయితే ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికలలో ప్రచారం చేస్తున్నప్పుడు అతనిపై పోలీసు కేసు నమోదైంది. దీంతో ఆనంద్ ను తప్పించారు మాయావతి. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీఎస్పీ ఘోర ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అనంతరం జూన్ 23న ఆదివారం జరిగిన బీఎస్పీ కోఆర్డినేటర్ గా మళ్లీ నియమిస్తున్నట్లు ప్రకటించారు.