Matka box office Day 1 : వరుణ్ తేజ్ కు కాలం కలిసిరావడం లేదు. ఆయన చేస్తున్న సినిమాలు ఆశించిన మేరకు కాదు.. ఊహించని దాని కన్నా ఎక్కువగా ఇబ్బందిని కలిగిస్తున్నాయి. గద్దలకొండ గణేశ్ తర్వాత ఆయనకు పెద్దగా కలిసి వచ్చిన సినిమా లేదనే చెప్పాలి. ఎఫ్3 వచ్చినా దాని సక్సెస్ లో విక్టరీ వెంకటేశ్ కూడా ఉండడంతో పూర్తి సక్సెస్ ఆయనకు దక్కలేదు. ఆ తర్వాత వచ్చిన గండీవధారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్ భారీగా డిజాస్టర్ తెచ్చిపెట్టాయి. ఇక ఇప్పుడు మట్కా కూడా ఆ దిశలోనే వెళ్తున్నట్లు కలెక్షన్లను చూస్తే తెలుస్తోంది.
మట్కాకింగ్ రతన్ ఖేత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన వరుణ్ తేజ్ తాజా చిత్రం ‘మట్కా’. నవంబర్ 14న థియేటర్లలోకి వచ్చినప్పటికీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కరుణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తొలి రోజు కేవలం రూ. 70 లక్షలు మాత్రమే వసూలు చేసి వరుణ్ కెరీర్ లోనే అత్యల్ప ఓపెనింగ్స్ సాధించింది.
గురువారం మొత్తం తెలుగు ఆక్యుపెన్సీ 15.71 శాతం కాగా, అత్యధికంగా విశాఖపట్నంలో 27.75 శాతం వచ్చింది. వరుణ్ గత చిత్రం ఆపరేషన్ వాలెంటైన్ నెగిటివ్ రివ్యూలు వచ్చినప్పటికీ రూ. 1.45 కోట్లు వసూలు చేసింది. విశాఖపట్నంలో 1958 నుంచి 1982 మధ్య కాలంలో సాగే మట్కాలో వాసు జీవితంలోని 24 ఏళ్ల విశేషాలను ప్రముఖ జూదగాడిగా, గ్యాంగ్ స్టర్ గా ఆయన ప్రయాణం సాగుతుంది.
ఈ సినిమాతో వరుస ఫ్లాప్స్ కు బ్రేక్ వేసి కంబ్యాక్ కావాలనుకున్నాడు వరుణ్. కానీ ఇది కూడా ఎదురుదెబ్బ కొట్టింది. ఇక ఈ సినిమా వీకెండ్ లో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్స్ సొంతం చేసుకుంటుందో చూడాలి.