JAISW News Telugu

Mass Maharaja : ఇండస్ట్రీలోకి మాస్ మహరాజ పిల్లలు.. ఏ మూవీతోనంటే?

Mass Maharaja

Mass Maharaja

Mass Maharaja : అసలు సినీ ఇండస్ట్రీతో సంబంధం లేకుండా ఎంట్రీ ఇచ్చి ఈ రోజు స్టార్లుగా నిలదొక్కుకున్న వారు చాలా తక్కువ. అందులో చిరంజీవి, రవితేజ, నాని లాంటి వారు ఉన్నారు. సహజంగానే ఈ రంగంలో పరిచయాలు ఉన్నవారికి అడ్వాంటేజ్ ఉంటుంది. హీరో రవితేజ పిల్లలు కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. వారు కూడా ఇప్పుడు సినిమాల్లో కెరీర్ ను ఎంచుకున్నారు.

రవితేజకు ఇద్దరు సంతానం ఒక కుమార్తె, ఒక కుమారుడు ఇద్దరూ సినిమా పరిశ్రమలో కెరీర్ కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. ఆయన కుమార్తె నిర్మాతగా మారాలని నిర్ణయించుకుంది. తన తండ్రికి ప్రస్తుతం ఉన్న నిర్మాణ సంస్థ ‘ఆర్టీ టీమ్ వర్క్స్’కు భిన్నంగా కొత్త బ్యానర్ ప్రారంభించాలని ఆమె ఆలోచిస్తుంది. ప్రస్తుతం సితార బ్యానర్ లో నిర్మాత నాగవంశీతో కలిసి ఒకటి రెండు చిన్న చిన్న ప్రాజెక్ట్స్ లో నటిస్తోంది. సొంత బ్యానర్ ప్రారంభించే ముందు ప్రొడక్షన్, ఫిల్మ్ మేకింగ్ మెళకువలు నేర్చుకుంటోంది.

ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. రవితేజ తన ఫైనాన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. తరచుగా రియల్ ఎస్టేట్ లో సురక్షితమైన పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతాడు. ఆర్థిక నష్టాలకు దారితీసే వ్యాపారాల పట్ల అప్రమత్తంగా ఉంటారు. ఈ నేపథ్యంలో ఫైనాన్షియల్ రిస్క్ ఎక్కువగా ఉండే సినీ నిర్మాణ రంగంలోకి తన కూతురు ప్రవేశించడం ఊహించని పరిణామం. ఆమె నిర్ణయంతో రవితేజ సంతృప్తి చెందనప్పటికీ, చివరికి అతను గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ముఖ్యంగా ఆమె పెళ్లికి ముందు తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకుంది. ప్రస్తుతం శ్రీవిష్ణు హీరోగా ఓ సినిమా ప్లాన్ చేస్తోంది.

ఇక రవితేజ కుమారుడు దర్శకత్వం వైపు వెళ్లాలనుకుంటున్నాడు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా నుంచి ఎంతో ప్రేరణ పొంది. ఒక సిఫార్సు ద్వారా ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరారు. మరి దర్శకుడిగా నిలదొక్కుకుంటాడో లేక చివరికి నటనలోకి అడుగుపెడతాడో చూడాలి. రవితేజ హీరోగా మారడానికి ముందు నాలుగేళ్లు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడని, ఆయన కుమారుడు కూడా అదే బాటలో వెళ్తున్నాడని తెలుస్తోంది.

Exit mobile version