Vishwak Sen : దసరా, సంక్రాంతి టాలీవుడ్ కు పెద్ద పండుగలు. ఈ రెండు పండుగలను పెద్ద సినిమాలు లాక్ చేసుకుంటాయి. సెలవులు కారణంగా సినిమాలకు కలెక్షన్లు పెద్ద ఎత్తున వస్తుంటాయి. దీంతో బడా నిర్మాతలు, టాప్ హీరోలు ఈ రెండు సీజన్లలో తమ సినిమాలను విడుదల చేస్తుంటారు. అయితే తమిళంలో మాత్రం దీపావళికి సినిమాలను విడుదల చేయడం సెంటిమెంట్ గా భావిస్తుంటారు. తమిళంలో దీపావళికి పెద్ద సినిమాలు విడుదల చేసేందుకు పోటీ పడుతుంటారు.
తమిళంతో పాటు తెలుగులో తమిళ చిత్రాల హవా కొనసాగనున్నది. తెలుగునాట దసరా సీజన్ లో మిస్సయిన సినిమాలు దీపావళికి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తుంటారు. అయితే ఈసారి టాలీవుడ్ లో దీపావళిని మాస్ కా దాస్ విశ్వక్ సేన్ లాక్ చేసుకున్నాడు. ఈ సారి అక్టోబర్ 31న దీపావళి పండుగ రానుంది. అయితే ఆ రోజు గురువారం… అంటే లాంగ్ వీకెండ్. ఇప్పటివరకూ ఈ డేట్ లో సినిమాలు రిలీజ్ అనౌన్స్ చేసుకున్నవి రెండు సినిమాలే ఉన్నాయి. కోలీవుడ్ నుంచి శివకార్తికేయన్ అమరన్ అక్టోబర్ 31న విడుదల చేసేందుకు నిర్మాత, విశ్వనటుడు కమల్ హసన్ ప్లాన్ చేస్తున్నాడు. కాశ్మీర్ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమ తెరకెక్కింది. రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకుడు.
ఇక టాలీవుడ్ విషయానికి వస్తే.. విశ్వక్ సేన్ మెకానిక్ రాకీని దీపావళికి విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు రామ్ తాళ్లూరి నిర్మాత. లాంగ్ వీకెండ్ ను దృష్టిలో పెట్టకొని అక్టోబర్ 31న విడుదల చేయడానికి నిర్ణయించారు. కాగా దీపావళికి తెలుగులో ఈ ఒక్క సినిమానే విడుదల కానుంది. సెంటిమెంట్ పక్కన పెడితే లాంగ్ వీకెండ్ కావడం, సోలో రిలీజ్ కావడంతో కలెక్షన్లకు డోకా ఉండదని పక్కాగా ప్లాన్ చేశారు.