Bride : కొన్ని గంటల్లో పెళ్లి.. మరో యువకుడితో వధువు పరారీ
Bride runs away : కర్నూలు జిల్లాలో ఓ పెళ్లి మధ్యలోనే ఆగిపోయింది. తెల్లవారితే పెళ్లి ముహూర్తం.. వధువు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. ఆమె ఉన్నట్లుండి కల్యాణ మండపంలో కనిపించకుండా పోయింది. వెంటనే బంధువులు సీసీ ఫుటేజీ పరిశీలిస్తే ఆమె మరె వ్యక్తితో కల్యాణ మండపం నుంచి బయటకు వెళ్తూ కనిపించింది. దీంతో వధువు తరపు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం లక్కసాగరానికి చెందిన బజారి కుమారుడికి, అనంతపురానికి చెందిన నరేంద్ర కుమార్ కుమార్తె వైష్ణవికి పెద్దలు శుక్రవారం (అక్టోబరు 25) పెళ్లి నిశ్చయించారు. పత్తికొండలోని గోపాల్ ప్లాజా కల్యాణ మండపంలో పెళ్లికి భారీగా ఏర్పాట్లు చేశారు. వధువు, వరుడు, వారి కుటుంబ సభ్యులు మండపానికి చేరుకున్నారు. తెల్లవారితే పెళ్లి కాగా కల్యాణ మండపంలో వధువు కనిపించకుండా పోయింది. సీస ఫుటేజీ పరిశీలిస్తే ఆమె మరో అబ్బాయితో కలిసి బయటకు వెళ్లినట్లు గుర్తించారు. ఆమెకు ఈ పెళ్లి ఇష్టం లేకపోవడంతో ప్రేమించిన యువకుడితో వెళ్లిపోయి ఉంటుందని అనుమానించారు. దీంతో పెళ్లి ఆగిపోయింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆ యువకుడి వివరాలు సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు.