Musk : ఆయన ముందు ఎందరు మస్క్ లైనా సరిపోరు.. సంపాదనలో ఓ రేంజ్ ఆయనది..
Musk :ప్రపంచ కుభేరుల్లో మస్క్ మొదటి వరుసలో ఉంటాడు. ఏటా ఆయన స్థానం కొంచెం అటు ఇటుగా మారినా సంపాదనలో మాత్రం ఆయన ఎప్పుడూ ముందే ఉంటారు. ఆయన కంటే ఎక్కువ డబ్బు అంటే రెండింతల సంపాదన ఉంటే ఎలా ఉంటారో ఊహించండి. అవును పట్టు పాన్పుల్లో నిద్రించవచ్చు. పంచ భక్ష పరమాన్నం భుజించవచ్చు కదా.. అలాంటి వారి గురించి తెలుసుకుందాం.
ఆయన ఒక దేశానికి రాజు.. కాదు కాదు.. చక్రవర్తి, మామూలు చక్రవర్తి కాదు మహా చక్రవర్తి. దీనికి తోడు మహాబలుడు కూడా. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషేషాలు ఉంటాయి. ఇక ఆయన సంపద గురించి తెలుసుకుంటే 400 బిలియన్ల డాలర్లు. ఇదే విశ్వకుబేరుడైన ఎలాన్ మస్క్ కన్నా రెండు రేట్ల ఎక్కువ అన్నమాట. మానవజాతి చరిత్రలో అంతటి సంపద కలిగిన రాజులు గానీ, చక్రవర్తులు గానీ మరొకరు లేరు. మరి ఆ కుభేరులకు కుభేరుడు ఎవరంటే ‘మన్సా మూసా’.
మన్సా మూసా ఎక్కడుండేవాడు?
ఆఫ్రికాలోని ప్రస్తుత మాలి, సెనెగల్, గినియా, గాంబియా, నైగర్, చాద్, నైజీరియా, మారిటేనియా తదితర దేశాలతో కూడిన సువిశాల సామ్రాజ్యాన్ని మన్సా మూసా పాలించాడు. దీనిని ‘మాలి’ విశాల సామ్రాజ్యం అని పిలిచేవారు. ప్రస్తుతం మాలిలోని టింబుక్ట్ ను నిర్మించింది ఈయనే. దీని కోసం పశ్చిమ ఆసియా, ఆఫ్రికా ఖండం నలుమూలల నుంచి వేలాది మంది నిపుణులైన పనివాళ్లను రప్పించారు. క్రీ.శ. 1312 నుంచి 1337 వరకు ఆయన పాలనలో మాలి విశ్వఖ్యాతి దక్కించుకుంది.
బంగారమే సంపద
మూసా సామ్రాజ్యంలో బంగారు గనులు, ఉప్పు గనులు పెద్ద ఎత్తున ఉండేవి. బంగారు గనులు ఎక్కువగా ఉండడంతో వేల టన్నులు ఈయన ఖజానాలో మూలుగుతుండేది. వీటిని ఇతర దేశాలకు ఎగుమతి చేసి భారీగా సంపాదించాడు.
లక్ష మందితో హజ్ యాత్ర!
మన్సా మూసా ‘హజ్ యాత్ర’కు వెళ్లినప్పుడు మార్గ మధ్యంలో ఈజిప్టులో ఆగి ఆ దేశ రాజుకు భారీగా బంగారం ఇచ్చాడు. దీంతో ఆ దేశంలో బంగారం విలువ భారీగా పడిపోయింది. అంటే ప్రతీ సారి వెళ్లినప్పడు కొంత ఇచ్చేవాడు. ఇలా మూసా వద్ద ఉన్న బంగారం నిల్వలు పడిపోయాయి. ఆయన హజ్ యాత్ర చేస్తే లక్ష మందికి పైగా పరివారంతో బయలుదేరినట్టు చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి. ప్రపంచంలో ఇంత ఖరీదైన యాత్ర ఇప్పటి వరకు ఏ రాజు, ఇప్పట్లో ఏ నాయకుడు కూడా చేయలేదు. యాత్ర నుంచి వచ్చిన తర్వాత టింబక్ట్ నగరంతోపాటు అనేక ప్రాంతాలను డెవలప్ చేశారు. ఆ కాలంలో మాలిలోని కొన్ని ప్రాంతాలు విద్యా కేంద్రాలుగా విలసిల్లుతుండేవి. సుదూర తీరాల నుంచి వేలాది మంది వచ్చి ఇక్కడ చదువుకునేవారు.
అనంతర కాలంలో మూసా అనేక ప్రజా ఉపయోగ కార్యక్రమాలు చేపట్టారు. అంతులేని ఐశ్వర్యానికి చిహ్నంగానే కాకుండా విద్యాభివృద్ధికి, శాస్త్ర సాంకేతిక పరిశోధనకు కృషి చేశారు. 1337లో మూసా కన్నుమూశారు.