Mansoor Ali Khan : ఎట్టకేలకు త్రిషకు క్షమాపణ చెప్పిన మన్సూర్ అలీ ఖాన్.. వివాదానికి చెక్ పడినట్టేనా ?

Mansoor Ali Khan and Trisha
Mansoor Ali Khan : గత వారం రోజులుగా తమిళ్ నటుడు మన్సూర్ అలీ ఖాన్ పేరు మార్మోగిపోతున్న విషయం తెలిసిందే.. ఇతడు స్టార్ హీరోయిన్ త్రిష మీద చేసి అసభ్యకర వ్యాఖ్యలతో అందరి ఆగ్రహానికి గురి అయ్యాడు.. ఇతడిపై ప్రతీ పరిశ్రమ వరుణ్ స్పందిస్తూ ఫైర్ అయ్యారు.. తమిళ్ ఇండస్ట్రీ మొత్తం త్రిషకు అండగా నిలిచింది..
మరి ఇంతగా ఈ భామపై ఇతడు చేసిన వ్యాఖ్యలు ఏంటంటే.. ఈ మధ్య త్రిష నటించిన సినిమాల్లో లేవు ఒకటి.. విజయ్ దళపతి హీరోగా త్రిష హీరోయిన్ గా నటించిన ఈ మూవీ దసరా కానుకగా రిలీజ్ అయ్యింది.. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది..
అయితే ఈ సినిమాలో మన్సూర్ కూడా కీలక పాత్రలో నటించాడు.. ఇతడు ఈ మధ్య ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ త్రిషతో రేప్ సీన్ ఉంటుంది అని అనుకున్న అని ఈమెతో బెడ్ రూమ్ సన్నివేశం ఉంటుంది అనుకోగా అలా పెట్టలేదు అంటూ బాధపడుతూ కామెంట్స్ చేసాడు..
ఈ వ్యాఖ్యలపై సెలెబ్రిటీలు సైతం మండిపడుతూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేసారు.. దీంతో ఎట్టకేలకు ఇతడు దిగి వచ్చి ఈ విషయంలో క్షమాపణలు చెప్పాడు.. మరి ఇతడు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటూ బహిరంగంగా క్షమాపణలు చెప్పడంతో ఈ వివాదానికి ఇక్కడితో ఫులుస్టాప్ పడుతుందో లేదో చూడాలి..