Manjummal Boys : ఓటీటీలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’..
– స్ట్రీమింగ్ తేదీ ఫిక్స్..

Manjummal Boys
Manjummal Boys : ఎట్టకేలకు మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ ‘మంజుమ్మల్ బాయ్స్’ ఓటీటీ రిలీజ్ తేదీ ప్రకటించారు. మే 5 నుంచి తమ ప్లాట్ ఫామ్ లో తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో స్ట్రీమింట్ చేయనున్నట్లు డిస్నీ హాట్ స్టార్ తెలిపింది. థియేటర్లలో రిలీజైన రెండున్నర నెలల తర్వాత స్ట్రీమింగ్ కాబోతుంది.
ఫిబ్రవరి 22న మలయాళంలో విడుదలై థియేటర్లలో సెన్సేషన్ సృష్టించింది. బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. తెలుగులో ఏప్రిల్ 6న విడుదలై ఇక్కడ దాదాపు రూ. 10 కోట్లకు పైగానే వసూళ్లు సాధించింది. ఒరిజినల్ వెర్షన్ రిలీజై దాదాపు రెండున్నర నెలల పైనే అవుతుంది. ఇప్పుడు హాట్ స్టార్ ‘మంజుమ్మల్ బాయ్స్’ ఓటీటీ రిలీజ్ తేదీ ప్రకటించింది. ఇదివరకు ప్రకటించినట్లు మే 3న కాకుండా 5వ తేదీన స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు హాట్ స్టార్ క్లారిటీ ఇచ్చింది.