JAISW News Telugu

Manchu Manoj Wife : ప్రెగ్నన్సీ తర్వాత మంచు మనోజ్ భార్య చేసిన ఈ గొప్ప చూస్తే చేతులెత్తి దండం పెడుతారు!

Manchu Manoj Wife

Manchu Manoj Wife

Manchu Manoj Wife : మంచు మోహన్ బాబు రెండవ తనయుడిగా ఇండస్ట్రీ లోకి వచ్చిన మంచు మనోజ్ కి టాలీవుడ్ లో ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. మంచు కుటుంబం మొత్తానికి సోషల్ మీడియా లో ఏ రేంజ్ ట్రోలింగ్స్ జరుగుతాయో మన అందరికీ తెలిసిందే. కానీ మంచు మనోజ్ ని మాత్రం ఎవ్వరూ ట్రోల్ చెయ్యరు. ఎందుకంటే అతని ప్రసంగాలు బాగుంటాయి, సినిమాలు కూడా కొత్త రకంగా ఉంటాయి.

అంతే కాకుండా మొదటి చిత్రం నుండి చివరి చిత్రం వరకు ఆయన నటించిన అన్నీ సినిమాల్లో కూడా పాటలు అద్భుతంగా ఉంటాయి. ఇప్పటికీ యూత్ ఆడియన్స్ మొబైల్ ఫోన్స్ లో ఆయన పాటలను వింటున్నారు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలా వృత్తి పరంగా మరియు వ్యక్తిగతంగా మంచి పేరు తెచ్చుకున్న మంచు మనోజ్, తన మొదటి భార్య కి విడాకులు ఇచ్చి రీసెంట్ గానే భూమా మౌనిక ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

మౌనిక కి కూడా ఇది రెండవ పెళ్లి. మొదటి భర్త తో ఆమెకి ఒక కొడుకు పుట్టాడు. విడాకులు తీసుకున్న తర్వాత కొడుకు మౌనిక వద్దనే పెరుగుతూ వచ్చాడు. మనోజ్ పెళ్లి చేసుకున్న తర్వాత మౌనిక కొడుకుని కూడా అంగీకరించాడు. ఆ తర్వాత వీళ్లిద్దరు పిల్లల్ని కంటారో లేదో అని అనుకున్నాం కానీ, రీసెంట్ గానే మౌనిక గర్భం దాల్చినట్టు మనోజ్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలిపాడు. మొదటి నుండి సేవాభావం ఎక్కువ ఉండే మనోజ్, మౌనిక గర్భం దాల్చిన సందర్భంగా, ఒక అనాధాశ్రయం కి వెళ్లి అక్కడ పిల్లలకు అన్నదానం చేసారు. తమ స్వహస్తం తో అందరికీ దగ్గరుండి వడ్డించారు కూడా. ఆ తర్వాత కాసేపు ఆ పిల్లలతో సరదాగా గడిపి  ఇంటికి తిరిగి వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది.

నెటిజెన్స్ ఈ వీడియో ని చూసి మనోజ్ దంపతులను పొగడ్తలతో ముంచి ఎత్తారు. ఇక మంచు మనోజ్ కెరీర్ విషయానికి వస్తే, చాలా కాలం గ్యాప్ తర్వాత మళ్ళీ ఆయన సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. వెండితెర మీద కనిపించే ముందు, ఆయన బుల్లితెర ఆడియన్స్ కి దగ్గర అవ్వడం కోసం ఈటీవీ లో ‘ఉస్తాద్’ అనే గేమ్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ షో ఇప్పుడు మంచి రేటింగ్స్ ని దక్కించుకుంటూ విజయవంతంగా నడుస్తుంది.

Exit mobile version