Manchu Lakshmi Diwali Celebrations : పేద విద్యార్థులతో కలిసి దీపావళి జరుపుకున్న మంచు లక్ష్మి.. పిక్స్ వైరల్!

Manchu Lakshmi Diwali Celebrations
Manchu Lakshmi Diwali Celebrations : దీపావళి పండుగను దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఘనంగా జరుపు కుంటున్నారు.. సాధారణ ప్రజలు మాత్రమే కాదు.. సెలెబ్రిటీలు కూడా ఈ పండుగను ఘనంగా జరుపు కున్నారు.. ఒక్కొక్కరి ఫోటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుండగా తాజాగా మంచు లక్ష్మి ఫోటోలు సైతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈ అమ్మడు కూడా దీపావళి ఘనంగా జరుపుకుంది.. అయితే మంచు లక్ష్మి తన టీచ్ ఫర్ చేంజ్ నిర్వహిస్తున్న ప్రభుత్వ పాఠశాలలోని పెద్ద విద్యార్థులతో కలిసి దీపావళి సెలెబ్రేషన్స్ చేసుకుంది.. పేద విద్యార్థులతో ఈ అమ్మడు సెలెబ్రేషన్స్ చేసుకున్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి..
ఈమె విద్యార్థులకు భోజనం కూడా ఏర్పాటు చేసి గిఫ్టులు ఇచ్చి వారితో ఆడి పాడింది.. ఈ ఫొటోలన్నీ సోషల్ మీడియాలో వైరల్ కాగా ఈమెను మెచ్చుకుంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.. ఇదిలా ఉందా ఈ భామ సినీ ఇండస్ట్రీలోకి మోహన్ బాబు వారసురాలిగా ఎంట్రీ ఇచ్చి చాలా ఏళ్ళు అయ్యింది..
అయినప్పటికీ ఇప్పటి వరకు రాణించలేక పోయింది.. హీరోయిన్ గా, విలన్ గా, నిర్మాతగా ఇలా చాలా రంగాల్లో రాణించాలని ప్రయత్నించినా కూడా ఆకట్టుకోలేక పోయింది. ప్రజెంట్ యాంకర్ గా చేస్తూ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటుంది.. మరి ముందు ముందు అయినా ఈ అమ్మడు ఏదైనా రంగంలో రాణిస్తుందో లేదో చూడాలి..