Manasanta Nuvve : చిన్న చిన్న లైన్లు పెద్ద విజయం వరకు తీసుకెళ్తాయి. ఒక్కో సారి ఆ చిన్న లైన్ డైలాగ్ సినిమా రూపు రేఖలను మార్చివేసిందా? అన్న అనుమానం సైతం కలుగుతుంది. ఒక చిన్న డైలాగ్ ఒక ప్రొడ్యూసర్ ను కదిలించింది. కట్ చేస్తే భారీ బాక్సాఫీస్ మూవీగా అవతరించింది. కానీ ఆ సినిమాను వదులుకున్న హీరోనే కాస్తా బాధపడ్డాడు. వివరాల్లోకి వెళ్తే..
స్టార్ ప్రొడ్యూసర్ ఎంఎస్ రాజు రూ. 15 కోట్లు వెచ్చించి ‘దేవీ పుత్రుడు’ తీశాడు. దానికి అనుకున్నంత కలెక్షన్లు రాకపోవడంతో తీవ్రంగా నష్టపోయాడు. ఎలాగైనా మంచి సినిమా తీసి ఆ నష్టాన్ని పూడ్చుకోవాలని అనుకున్నాడు. ఆ లోచనను తన ఆప్తుడు గోపాల్ రెడ్డితో పంచుకున్నాడు రాజు. దీంతో తన వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న వీఎన్ ఆదిత్యను రాజు ఆఫీస్ కు పిలిపించాడు గోపాల్ రెడ్డి.
వీఎన్ ఆదిత్యకు ఒక పవర్ ఫుల్ కథతో చిన్న బడ్జెట్ తో సినిమా తయారు చేయాలని రాజు కోరాడు. వీఎన్ ఆదత్య ఒక లైన్ ‘ఒరేయ్ వర్షం కూడా అప్పుడప్పుడు మేలు చేస్తుంది రా!.. మన కన్నీళ్లు ఎదుటి వారికి కనిపించకుండా దాచేస్తుంది’ అనే డైలాగ్. ఈ డైలాగ్ ఎంఎస్ రాజుకు నచ్చుతుంది. దీంతో వెంటనే రూ. 25వేల చెక్కు అడ్వాన్స్ గా దర్శకుడు వీఎన్ ఆదిత్యకు ఇచ్చాడు రాజు. కట్ చేస్తే అది ‘మనసంతా నువ్వే’ సినిమాగా రూపు దిద్దుతుంది.
అయితే, మొదలు హీరోగా మహేశ్ బాబును తీసుకుంటే బాగుంటుందని అనుకున్నారు. MS రాజు మహేశ్ కు కథ చెప్పారు. కథ బాగుందని మహేశ్ కూడా చెప్పారు. కానీ అప్పటికే ఆయన గుణశేఖర్ డైరెక్షన్ లో సినిమాకు చేస్తున్నాడు. దీనికి తోడు కొత్త దర్శకుడు స్టోరీ కూడా కామన్ గా ఉండేదే కావడంతో వదులుకున్నాడు. ఆ తర్వాత కొత్త హీరో అయితే బాగుండని ఆదిత్య రాజుకు చెప్పాడు. తర్వాత రాజు దృష్టి ఉదయ్ కిరణ్ పై పడింది. ఆ సమయంలో ఒక షూటింగ్ లో ఉన్నాడు ఉదయ్ కిరణ్. అక్కడికి వెళ్లి ఆయన పర్ఫార్మెన్స్ చూసిన ఆదిత్య ఓకే చేశాడు.
దీంతో రూ. 1.3 కోట్లతో రూపొందిన ‘మనసంతా నువ్వే’ 19 అక్టోబర్, 2001న రిలీజైంది. తెలుగు రాష్ట్రాల్లో 36 సెంటర్లలో 100 రోజులు దిగ్విజయంగా ప్రదర్శింపబడి రూ. 12 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. 5 భాషల్లో రిమేక్ కూడా అయ్యింది. ఉదయ్ కిరణ్ హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ లో ఈ మూవీ కీలకంగా మారింది.