JAISW News Telugu

Netherlands : విమానం ఇంజన్ లో పడి వ్యక్తి మృతి

Netherlands

Netherlands

Netherlands : అనుమానాస్పద స్థితిలో విమానం ఇంజన్లో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన నెదర్లాండ్స్ లోని ఆమ్ స్టర్ డామ్ విమానాశ్రయంలో జరిగింది. డెన్మార్క్ కు ప్రయాణించేందుకు కేఎల్ 1341 విమానం పుష్ బ్యాక్ అవుతున్న సమయంలో అక్కడే ఉన్న వ్యక్తిని ఇంజన్ ఒక్కసారిగా లోపలికి లాక్కొంది. అత్యంత వేగంగా తిరుగుతున్న బ్లేడ్లలో చిక్కుకొని ఆ వ్యక్త అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి వివరాలు ఇప్పటి వరకు తెలియలేదు.

వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న నెదర్లాండ్స్ మిలటరి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదవశాత్తు ఆ వ్యక్తి ఇంజన్ లో పడ్డాడా? లేక ఆత్మహత్యకు పాల్పడ్డాడా? అనేది తేలాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ప్రమాదం సమయంలో విమానంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బందిని దింపేసి వారికి మానసిక నిపుణులతో కౌన్సెలింగ్ ఇప్పిస్తామని ఎయిర్ లైన్స్ తెలిపింది.

చనిపోయిన వ్యక్తి విమానయాన సంస్థ ఉద్యోగి అయి ఉంటాడని డచ్ మీడియా సంస్థలు కథనాల్లో పేర్కొన్నాయి. ప్రమాద సమయంలో అతడు విమానం పుష్ బ్యాక్ పనిలో నిమగ్నమై ఉండొచ్చని వెల్లడించాయి.

Exit mobile version