Mamata Banerjee : పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తలకు తీవ్ర గాయాలైన సంగతి తెలిసిందే. మమతా తలకు గాయమైన ఫొటోను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎక్స్ లో షేర్ చేసింది. ఆస్పత్రి బెడ్ పై పడుకుని ఉండగా.. ఆమె తల నుదిటి భాగాన గాయమైనట్టు స్పష్టంగా తెలుస్తోంది. ముఖం మీదుగా మెడ వద్దకు రక్తం కారుతూ కనిపించారు. ‘ మా చైర్ పర్సన్ మమతా బెనర్జీ గాయపడ్డారు. దయచేసి ఆమె కోసం ప్రార్థించండి’’ అంటూ తృణమూల్ ట్వీట్ చేసింది.
కాగా, మమతా బెనర్జీ గురువారం కాళీఘాట్ లోని తన ఇంట్లో ప్రమాదవశాత్తు జారిపడడంతో ఆమెకు గాయమైంది. దీంతో వెంటనే ఆమెను కోల్ కతా లోని ఎస్ఎకేఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇక ఈ ఏడాది జనవరిలోనూ కారు ప్రమాదంలో మమతా తలకు స్పల్ప గాయమైంది. బర్ధమాన్ నుంచి కోల్ కతాకు తిరిగి వస్తుండగా.. ఆమె కాన్వాయ్ కు ఎదురుగా మరో వాహనం రావడంతో దాన్ని తప్పించేందుకు డ్రైవర్ కారుకు బ్రేక్ లు వేశాడు. దీంతో ముందు సీట్లో కూర్చున్న సీఎం.. విండ్ షీల్డ్ కు ఢీకొనడంతో తలకు స్వల్ప గాయమైంది.
కాగా నిన్న జరిగిన గాయం ఫొటోను చూసి పలు వ్యాఖ్యలు వినపడ్డాయి. కొందరికీ కారణం తెలుసుకోకుండా.. మరో ఎన్నికల స్టంట్ కు తెరతీశారని కామెంట్స్ వెల్లువెత్తించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాలుకు దెబ్బతగిలి..వీల్ ఛైర్ లోనే ప్రచారం చేయడం గుర్తుండే ఉంటుంది. ఇది కూడా అలాంటి ట్రిక్కే అనుకున్నారు. కానీ మమతా పార్టే ఆమె ట్రేడ్ మిల్ నుంచి పడ్డారని చెప్పడంతో కామెంట్స్ తగ్గిపోయాయి.