JAISW News Telugu

Mohammed Muijju : భారత పర్యాటకులకు మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జూ స్పెషల్ అప్పీల్

 Mohammed Muijju

Mohammed Muijju

Mohammed Muijju : మాల్దీవులు-భారత్ మధ్య గతంలో ఉద్రికత్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఇప్పుడు ఈ సంబంధాలను మరల కొనసాగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జూ ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్నారు. భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజు సమావేశమయ్యారు. మహ్మద్ ముయిజ్జూ కూడా ప్రధాని మోదీని కలిశారు. ఈ సమావేశంలో గత చేదు విషయాలను మరిచిపోయి ముందుకు వెళ్లే ప్రయత్నం తప్పలేదు. భారతదేశానికి వచ్చిన మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జూ, భారతదేశ భద్రతను బలహీనపరిచే విధంగా తమ దేశం వ్యవహరించదని… న్యూఢిల్లీని విలువైన భాగస్వామిగా, స్నేహితుడిగా పరిగణిస్తున్నామని, రక్షణతో సహా అనేక రంగాలలో సహకారానికి ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఉంటుందని అన్నారు.  మేం వివిధ రంగాల్లో ఇతర దేశాలతో సహకారాన్ని పెంపొందించుకుంటున్నప్పుడు.. మా చర్యలు మా ప్రాంత భద్రత, స్థిరత్వంపై రాజీ లేకుండా ఉండేలా చూసుకుంటాం. మా పొరుగువారు, స్నేహితులపై గౌరవంతో వ్యవహరించడం మా డీఎన్‌ఏలో ఉందన్నారు.

మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జూ  తన ఎన్నికల ప్రచారంలో ఇండియా ఔట్‌కు పిలుపునిచ్చారు. ప్రస్తుతం మాల్దీవులు భారీ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మాల్దీవులకు భారీ అప్పులు ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో, మాల్దీవులు దాని పొరుగు దేశం అయిన భారతదేశం ఆదుకుంటుందని భావిస్తుంది.  దీంతో వారి భారతదేశ పర్యటనకు ప్రాముఖ్యత ఏర్పడింది.  గతంలో కూడా భారత్ మాల్దీవులకు సహాయం చేస్తున్నందున, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న మాల్దీవులు కూడా భారతదేశం నుండి ఆర్థిక సహాయం ఆశిస్తుంది.  భారతదేశంతో మాల్దీవుల సంబంధాలు ఉమ్మడి ప్రయోజనాలపై ఆధారపడి ఉన్నాయని మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ అన్నారు. ఢిల్లీ తన దేశం అతిపెద్ద వాణిజ్యం, అభివృద్ధి భాగస్వాములలో ఒకటిగా ఉంది. భారతదేశ భద్రతకు భంగం కలిగించే పనిని మాల్దీవులు ఎప్పటికీ చేయదని టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అన్నారు.

భారతీయ పర్యాటకులకు కీలక సూచన  
మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ మాట్లాడుతూ.. మన పొరుగువారు, స్నేహితుల పట్ల గౌరవం మన డీఎన్‌ఏలోనే ఉందన్నారు. దీనితో పాటు, మాల్దీవులను సందర్శించాలని ఆయన భారతీయ పర్యాటకులకు విజ్ఞప్తి చేశారు. మాల్దీవులకు చెందిన చాలా మంది నాయకులు ప్రధాని మోదీపై వ్యాఖ్యానించారు. ఆ తర్వాత భారతీయ పర్యాటకులు మాల్దీవులను సందర్శించడం తగ్గించారు. ఫలితంగా మాల్దీవులు చాలా నష్టపోయింది. అయితే, మాల్దీవుల విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ వ్యాఖ్యలకు దూరంగా ఉండటంతో మంత్రులను సస్పెండ్ చేశారు. మేలో ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావడానికి కొన్ని వారాల ముందు, భారతదేశం ఇచ్చిన మూడు విమానయాన ప్లాట్‌ఫారమ్‌లపై మోహరించిన 90 మంది సైనిక సిబ్బందిని తొలగించాలని మాల్దీవులు చేసిన అభ్యర్థన కూడా అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే, ఢిల్లీ ఈ అభ్యర్థనను అంగీకరించింది. సైనిక సిబ్బంది స్థానంలో సాంకేతిక సిబ్బందిని నియమించింది. మాల్దీవుల ప్రజలు దేశంలో ఒక్క విదేశీ సైనికుడిని కూడా కోరుకోవడం లేదని  ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.

Exit mobile version