JAISW News Telugu

Maldives : హవ్వ..బుల్లిదేశంపై మనబోటి దేశ ప్రతాపమా?

maldives

maldives

Maldives : ఒక్కొక్కసారి మన దేశంలో విచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి. దేశభక్తి అనేది అందరిలోనూ ఉంటోంది. కొందరిలో కాస్త ఎక్కువ, తక్కువలూ ఉండొచ్చు. మొత్తానికైతే అందరూ దేశాన్ని ప్రేమిస్తారు. దేశాన్ని ప్రేమించలేనివారేవరైనా ఉంటే అది వాళ్ల ఖర్మ. కొందరు చిన్న విషయాలకు విపరీతంగా స్పందిస్తూ.. అసలు స్పందించాల్సిన విషయాలకు స్పందించనే స్పందించరు. ఇక మొన్నటికి మొన్న ప్రధాని మోదీ లక్షద్వీప్ లో కుర్చీ వేసుకుని కూర్చోగానే.. మాల్దీవులు అనే దేశానికి మడతడిపోయిందంటూ.. ఆ దేశానికి టూరిజం బుకింగ్స్ మొత్తం క్యాన్సిల్ అయిపోయాయంటూ జనాలు జబ్బలు చరుచుకుంటున్నారు. ప్రధాని మోదీపై అక్కడి మంత్రులు చేసిన విమర్శలతో ‘బాయ్ కాట్ మాల్దీవ్స్’ అని సోషల్ మీడియాలో పెద్ద ఉద్యమమే చేశారు. ఆ మాటలు అన్నవారిని తొలగించినట్టుగా ఆ దేశ అధ్యక్షుడు ప్రకటించినా  ఒక్కరూ తగ్గరేం.

మాల్దీవుల వల్లే లక్షద్వీప్ టూరిజం పరంగా డెవలప్ కావడం లేదు అన్నది పూర్తిగా అవాస్తవం. లక్షద్వీప్ అనేది ఎన్నో శతాబ్దాలుగా మన భూభాగమే. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి గాని, మొన్న మోదీ వచ్చినప్పటి నుంచి గాని ఏమైనా అభివృద్ధి జరిగిందా, టూరిజం పరంగా మౌలిక సదుపాయాల కల్పన జరిగిందా అంటే.. ఏదీ జరగలేదు. ఇక ఉన్నపళంగా మాల్దీవులకు వెళ్లొద్దు.. లక్షద్వీప్ కే వెళ్లాలంటే.. ఎలా?  టూరిస్టులు అనేవారు ఒక ప్రాంతానికి వెళ్లరు కదా. ఎక్కడ బాగుంటే అక్కడికి వెళతారు. థాయిలాండ్ ఉంది కదా అని మారిషన్ కు వెళ్లరా? స్విట్జర్లాండ్ కు వెళ్లామని పారిస్ కు వెళ్లరా?

టూరిజం డెవలప్ కావాలంటే అక్కడ ఉన్నత స్థాయి సదుపాయలు కల్పించాలి. విదేశీ, స్వదేశీ టూరిస్టుల కోసం మంచి హోటల్స్, వినోద, సాహస క్రీడలకు అవకాశం ఉండాలి. వరల్డ్ క్లాస్ రవాణా సదుపాయాలు, అలాగే ప్రపంచ వ్యాప్త ప్రమోషన్లు ఇవ్వాలి. మాల్దీవుల్లో టూరిజం పరంగా డెవలప్ కావడానికి వారు ఎన్నో ప్యాకేజీలు, సదుపాయాలు కల్పిస్తారు. అందుకే అక్కడికి టూరిస్టులు వెళ్తుంటారు. బాలీవుడ్ తారలతో ఫ్రి టిప్ వేకేషన్స్ పెట్టి ప్రమోషన్ చేయించకుంటారు. లక్షల్లో మాల్దీవులకు వెళ్తుంటే.. లక్షద్వీప్ కు  కనీసం వేలల్లో అయిన టూరిస్టులు వెళ్లేలా సదుపాయాలు ఎందుకు కల్పించలేదు.

మాల్దీవులు అనేది చాలా చిన్న దేశం. జనాభా 5 లక్షలు. మన శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గమంతా జనం ఉంటారు. ఆ దేశం మరో యాభై ఏండ్లలో ఉంటుందో ఉండదో కూడా తెలియదు. గ్లోబల్ వార్మింగ్ వల్ల సముద్రాల్లో నీటిమట్టం పెరగడంతో ఆ దేశం మునిగిపోయే ప్రమాదం ఉంది. అంతదానికి అక్కరకు రాని ఓ వివాదం తెచ్చి ఏం సాధించాలనుకుంటున్నారో ఎవరికీ అర్థం కాదు.

వాస్తవానికి ఈ వివాదంతో దేశంలోని 135 కోట్ల మందికి అవసరమే లేదు. వీరికి టూర్లకు పోయే స్థోమతనే లేదు. రోజూ పనిచేస్తేనే పూటగడిచేది. ఏదో కొద్దిగా సంపాదిస్తే ఏ తిరుపతికో, వేములవాడకో వెళ్తారు తప్పా మాల్దీవులకు గాని, లక్షద్వీప్ కు గాని వెళ్తే తహత్తు లేదు. కాకపోతే మాల్దీవులు చేసిన తప్పు ఏంటంటే.. ఆ దేశానికి చైనా అనుకూల అధ్యక్షుడు రావడంతో భారత్ పట్ల కొన్ని వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నాడు. అలాంటి వాటిని వారి విదేశాంగ అధికారులకు చెప్పి సరిచేసుకోవచ్చు. అంతే తప్ప బుల్లి దేశంపై విశ్వగురు అయినా మన దేశం ప్రతీకారం తీర్చుకుంటే మనకే అవమానం.

Exit mobile version