Drunk and driving case : డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో మలయాళ స్టార్ నటుడు అరెస్టు.. బెయిల్ పై విడుదల

drunk and driving case
drunk and driving case : ఇటీవల మలయాళ సినీ నటుడు బైజు సంతోష్ మద్యం సేవించి వాహనం నడుపుతూ మోటార సైకిల్ ను ఢీకొట్టిన కేసులో అరెస్టయ్యాడు. వివరాల్లోకి వెళితే.. నటుడు బైజు సంతోష్ అర్ధరాత్రి 12 గంటల సమయంలో మద్యం సేవించి తిరువనంతపురంలోని వెల్లయంబాలంలో కారులో వెళ్తూ ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. అనంతరం విద్యుత్ స్తంభాన్ని కూడా ఢీకొట్టాడు. అయితే ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించి ఉండడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
స్థానికుల సమాచారంతో పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని నటుడు బైజు సంతోష్ ను అదుపులోకి తీసుకున్నారు. కారును స్వాధీనం చేసుకొని ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. దీంతో కండిషన్ తో కూడిన బెయిల్ పై ఈ రోజు (అక్టోబరు 14) బైజు సంతోష్ విడుదలయ్యాడు.