Anil Arora Suicided : బాలీవుడ్ స్టార్ నటి మలైకా అరోరా తండ్రి అనిల్ అరోరా సూసైడ్ చేసుకున్నారు. అయితే, ఇది ప్రమాదవశాత్తు జరిగిందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. బుధవారం (సెప్టెంబర్ 11) ఉదయం 9 గంటల సమయంలో అనిల్ అరోరా ముంబైలోని బాంద్రాలోని తన అపార్ట్మెంట్ భవనం మూడో అంతస్తు నుంచి దూకాడు. ఈ ఘటన జరిగిన తర్వాత మలైకా మాజీ భర్త అర్బాజ్ ఖాన్ ఆమె అపార్ట్‌మెంట్ బయట కనిపించాడు. ఆ సమయంలో మలైకా పూణె నుంచి ముంబైకి తిరుగు ప్రయాణమవుతోంది.
మృతదేహాలను పోస్టుమార్టం కోసం భాభా హాస్పిటల్ కు తరలించారు. మరణానికి సంబంధించిన ఇతర వివరాలు ఇంకా తెలియలేదు. దీనిపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. మహారాష్ట్రలోని థానేలో జన్మించిన మలైకా.. ఆమెకు 11 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ఆమె తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. ఆమె తన తల్లి, సోదరి అమృతా అరోరాతో చెంబూర్ కు వెళ్లింది. ఆమె తల్లి జాయిస్ పాలీకార్ప్ మలయాళీ క్రిస్టియన్. ఆమె తండ్రి అనిల్ అరోరా పంజాబీ, ఇతను గతంలో భారతీయ మర్చంట్ నేవీలో ఉద్యోగం చేసేవాడు.
ఇటీవల ఓ ఫ్యాషన్ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మలైకా తన తల్లిదండ్రులు విడిపోవాలని నిర్ణయించుకున్నప్పుడు తన 11 ఏళ్ల వయసులో ఎలా ఉండేదో చెప్పుకొచ్చింది. తన బాల్యం అద్భుతంగా ఉన్నప్పటికీ అది అంత సులువు కాదని, అల్లకల్లోలంగా ఉందని ఆమె అన్నారు. ‘నా తల్లిదండ్రుల విడిపోవడం వల్ల నా తల్లిని కొత్త కోణంలో చూడగలిగాను’ అని ఆ ఇంటర్వ్యూలో తెలిపింది.
తన తండ్రి మరణించాడన్న వార్త తెలియగానే మలైకా స్నేహితులు ఆమె కుటుంబాన్ని పరామర్శించడం కనిపించింది. ఆమె మాజీ పార్ట్నార్ అర్జున్ కపూర్, ఇతరుల వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఆమె మాజీ భర్త కుటుంబ సభ్యులు ఆమె పక్కనే ఉన్నారు. ఆమె మాజీ అత్తమామలు సలీం ఖాన్, సల్మా ఖాన్‌తో పాటు కుమారుడు సోహైల్ ఖాన్, కుమార్తె అల్విరా అగ్నిహోత్రి మలైకా తల్లిదండ్రుల ఇంటికి హాజరయ్యారు.