Ustad Bhagat Singh : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ చిత్రం అప్పట్లో ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ కి హిట్లు రావేమో, ఆయన పని అయిపోయింది అని అభిమానులు సైతం ఆశలు వదిలేసుకున్న సమయం లో ఈ చిత్రం ఇచ్చిన కిక్ మామూలుది కాదు. ఇప్పటికీ ఈ సినిమా చూడని వాళ్ళు చూస్తే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయిపోతారు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆ రేంజ్ సెన్సేషన్ సృష్టించిన సినిమా అది.
అలాంటి సినిమా తీసిన హరీష్ శంకర్ లాంటి డైరెక్టర్ తో పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమా తీస్తున్నాడు అని చెప్పగానే అభిమానుల్లో ఆనందం తారాస్థాయికి చేరుకుంది. అలా పవన్ కళ్యాణ్ తనకి ఉన్న కమిట్మెంట్స్ మొత్తాన్ని పూర్తి చేసుకొని ఈ సినిమా ప్రారంభించే లోపు రెండేళ్లు అయ్యింది.
ఇప్పటి వరకు సుమారుగా 20 రోజుల పాటు షూటింగ్ పూర్తి అయ్యింది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అవ్వడానికి ముందు ఈ సినిమా షూటింగ్ లో ఉండేవాడు. ప్రస్తుతానికి తాత్కాలిక విరామం ఇవ్వగా, ఎన్నికలు పూర్తి అయిన వెంటనే మళ్ళీ తిరిగి ప్రారంభం కానుంది ఈ సినిమా. అయితే ఈసారి హరీష్ శంకర్ ఈ చిత్రం నుండి తప్పుకున్నాడా?, అంటే అవుననే అంటున్నారు కొన్ని విశ్వసనీయ వర్గాలకు సంబంధించిన వారు. రీసెంట్ గానే ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీ పవన్ కళ్యాణ్ ని కలిసాడని, ఆయన పవన్ కి ఒక అద్భుతమైన కథ వినిపించడం తో సింగల్ సిట్టింగ్ లోనే పవన్ కళ్యాణ్ ఆ కథకి ఓకే చెప్పాడని, త్వరలోనే షూటింగ్ మొదలు అవుతుందని నిన్న ఒక వార్త వినిపించింది.
అయితే ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న మరో వార్త ఏమిటంటే, హరీష్ శంకర్ ఇక ఈ సినిమా నుండి తప్పుకున్నాడని, ఇక నుండి ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రానికి ‘అట్లీ’ దర్శకత్వం వహిస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉందో హరీష్ శంకర్ రెస్పాన్స్ ఇస్తే కానీ అర్థం కాదు. ఉస్తాద్ భగత్ సింగ్ కి బాగా గ్యాప్ రావడం తో రీసెంట్ గానే ఆయన రవితేజ తో ‘మిస్టర్ బచ్చన్’ అనే చిత్రాన్ని ప్రారంభించాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చెయ్యాలని అనుకుంటున్నారు మేకర్స్.