JAISW News Telugu

Jagan Sarkar : జగన్ సర్కార్ పై కోర్టుకెళ్లిన మహింద్రా.. ఎందుకంటే..

Jagan Sarkar

Jagan Sarkar

Jagan Sarkar : కొందరు వ్యక్తులు పదవులకు వన్నె తెస్తారు. అలాంటి  వారి పాలనలో ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. ఆ రాజ్యాన్ని ప్రపంచమంతా కీర్తిస్తుంటుంది. కానీ కొందరు నేతల వల్ల పదవులకు చెడ్డపేరు రావడమే కాదు ఆ రాజ్యం కూడా అధమ స్థానానికి వెళ్తుంటుంది. ఇప్పుడు ఈ కోవకు చెందినవారే ఏపీ సీఎం జగన్. ఆయన వల్ల రాష్ట్రంలో ఒక్క మంచి పని జరుగకపోగా..అపఖ్యాతి వస్తోంది.

సీఎం జగన్ రెండున్నరేళ్ల కింద వాహనాలు కొన్నారు..వాడుకున్నారు..వాటికి గొప్పగా జెండా కూడా ఊపారు. కానీ ఇప్పటి వరకూ ఆ వాహనాల డబ్బులు చెల్లించలేదు. వాహనాలు ఇచ్చిన మహింద్రా కంపెనీ అడిగి అడిగి విసుగుపుట్టి చివరకు కోర్టుకు వెళ్లింది. అంతేనా టెండర్లు ఖరారు చేసేందుకు ఉన్న గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ పోలీస్ శాఖను బ్లాక్ లిస్టులో పెట్టింది.

ముఖ్యమంత్రి జగన్ దిశ పేరుతో చేసిన ప్రచార ఆర్భాటం ఇంకా ఎవరూ మరిచిపోలేదు. దిశ పోలీస్ స్టేషన్లకు, పోలీస్ అధికారుల కోసం 2022 జనవరిలోనే 163 బొలేరో వాహనాలను మహింద్రా అండ్ మహింద్రా కంపెనీ నుంచి కొనుగోలు చేశారు. రెండు విడతలుగా కొనుగోలు చేసిన ఈ వాహనాలను సీఎం అదే ఏడాది మార్చి 23న ప్రారంభించి దిశ పోలీస్ స్టేషన్లకు అందించారు. ఈ వాహనాలకు సంబంధించిన వారంటీ కూడా చివరి దశకు వస్తున్నప్పటికీ బిల్లులు ఇప్పటి వరకు చెల్లించలేదు.

ప్రభుత్వ ఈ-మార్కెట్ ప్లేస్ నిబంధనల మేరకు ఏపీ పోలీస్ శాఖ బ్లాక్ లిస్టులోకి చేరుకుంది. దీని వల్ల ఈజీఎం ద్వారా కొత్త వాహనాలను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర పోలీస్ శాఖకు అవకాశం లేకుండా పోయింది. వాహనాలకు బిల్లులు రాకపోవడం, నిబంధనలను ఉల్లంఘించడంతో మహింద్రా కంపెనీ కోర్టును ఆశ్రయించింది. అలాగే కొనుగోళ్లపై ఒప్పందం కుదిరిన నాటి నుంచి 12 శాతం వడ్డీతో తమ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తోంది. బకాయిలకు 12 శాతం వడ్డీని అదనంగా చెల్లించాల్సి ఉంది.

Exit mobile version