Mahesh Babu : భార్యను ఎలా మ్యానేజ్ చేయాలో టిప్ చెప్పిన మహేష్.. సూపర్ అంటున్న ఫ్యాన్స్!

Mahesh Babu

Mahesh Babu

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు బయట కనిపించేది చాలా తక్కువ అనే చెప్పాలి. తన సినిమాల ప్రమోషన్స్ లోనో లేదంటే వేరే వాళ్ళ సినిమాల ఈవెంట్స్ లోనో అప్పుడప్పుడు సందడి చేస్తారు.. అయినా ఈయన మాట్లాడే మాటలు చాలా తక్కువ.. కానీ మాట్లాడేవి కొన్నే అయినప్పటికీ మహేష్ స్పీచ్ అందరిని ఆకట్టుకుంటుంది.

మరి తాజాగా అలాంటి ఆకట్టుకునే స్పీచ్ మహేష్ నుండి రావడంతో ఫ్యాన్స్ ఈ క్లిప్ ను తెగ షేర్ చేసుకుంటున్నారు. ఇంతకీ మహేష్ బాబు ఎక్కడ మాట్లాడారో తెలుసా.. మన ఇండియన్ సినిమా దగ్గర మరో పాన్ ఇండియన్ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది.. అదే ”యానిమల్” మూవీ.. ఈ సినిమా డిసెంబర్ 1న రిలీజ్ అవుతుంది..

ఈ సినిమా ప్రమోషన్స్ ను తెలుగులో కూడా బాగా చేస్తూ ఇక్కడ కూడా భారీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.. సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో రణబీర్ కపూర్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి హైదరాబాద్ లో ఘనంగా జరుగగా ఈ ఈవెంట్ కు మహేష్, రాజమౌళి అతిథులుగా హాజరయ్యారు.

ఈ క్రమంలోనే మహేష్ స్పీచ్ ఆకట్టుకుంది. ఈయనను సుమ ఫన్నీ ప్రశ్న అడుగగా అదే రేంజ్ లో మహేష్ సమాధానం చెప్పారు.. భార్యను ఎలా మ్యానేజ్ చేయాలి అని సుమ మహేష్ బాబును అడిగింది. అందుకు మహేష్ ఎప్పుడు నవ్వుతూ ఉంటే మ్యానేజ్ చేయగలుగుతాం.. అంటూ నవ్వుతు రిప్లై ఇచ్చారు.. ఈ రిప్లై అందరిని ఆకట్టుకుంటుంది.

TAGS