సినిమాలో ఆయన కనీసం ఒక 50 బీడీలు కాల్చినట్టుగా మనకి అనిపిస్తుంది. మనలాంటి వాళ్ళు ఒక్క బీడీ తాగితేనే తట్టుకోలేం. అలాంటిది మహేష్ బాబు అన్ని బీడులు ఒక్క సినిమా లో ఎలా కాల్చాడు అని అందరూ ఆశ్చర్యపోయారు. ఇదే విషయాన్ని నేడు జరిగిన ఒక ఇంటర్వ్యూ లో యాంకర్ మహేష్ బాబు ని అడుగుతుంది. మీరు సిగరెట్స్ మానేశారు కదా , అలాంటిది ఇన్ని బీడీలు ఎలా కాల్చారు అని అందుగుతుంది.
దానికి మహేష్ బాబు సమాధానం చెప్తూ ‘నేను ముందుగా ఒక బీడీ కాల్చాను. అది నాకు అసలు పడలేదు, మైగ్రేన్ వచ్చి తల పగిలిపోయింది. త్రివిక్రమ్ గారితో ఏంటండీ ఇది, నా వల్ల కాదు సార్ ఇలాంటివి అని చెప్పాను. అప్పుడు ఆయన ఆయుర్వేదిక్ బీడీలను తెప్పించాడు. ఒకటి తాగాను, చాలా బాగా అనిపించింది. అదే కొనసాగించమని చెప్పాను. మీరు చూసిన బీడీలు మొత్తం ఆయుర్వేదిక్ బీడీలే’ అంటూ చెప్పుకొచ్చాడు మహేష్ బాబు. ఇది విన్న తర్వాత ఇదేదో బాగుంది, అవి ఎక్కడ దొరుకుతాయో చెప్తే మేము కూడా తీసుకుంటాం కదా మహేష్ అన్నా అంటూ ఆయన్ని సోషల్ మీడియా లో ట్యాగ్ చేసి అడుగుతున్నారు ఫ్యాన్స్. ఈ ఆయుర్వేదిక్ బీడీ లోపల లవంగం ఉంటుంది. ఆకు కూడా ఔషధమే అంటూ మహేష్ చెప్పుకొని. ఒక్కో బీడీ ధర దాదాపుగా 20 రూపాయిలు ఉంటుందట.
ఇకపోతే ‘గుంటూరు కారం’ చిత్రానికి మొదటిరోజు టాక్ లేకపోయినా కూడా సంక్రాంతి పండుగ సెలవుల్లో మంచి వసూళ్లనే దక్కించుకుంది. ట్రేడ్ పండితులు అనిడిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి ఇప్పటి వరకు 72 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. ఫుల్ రన్ లో కచ్చితంగా 80 కోట్ల రూపాయిల మార్క్ ని దాటుతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఓవరాల్ గా ఫుల్ రన్ కమర్షియల్ డిజాస్టర్ ఫ్లాప్ గా నిలుస్తుందని అంచనా.