Phone Pay : ఫోన్ పేలో మహేష్ బాబు వాయిస్..

Mahesh Baby Voice in Phone Pay
Phone Pay : సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక్కడే పాన్ ఇండి యా మార్కెట్ లోకి ఇంకా అడుగుపెట్టలేదు. అయితే ఆయనకున్న ఫాలోయింగ్ మాత్రం పాన్ ఇండియా స్థాయిలో ఉంటుంది. రాజమౌళి సిని మాతో పాన్ వరల్డ్ మూవీలో నటించబోతున్న ప్రిన్స్ ఈ సినిమాతో ఎన్ని సంచలనాలు నమోదు చేయనున్నాడో అని యావత్ భారతీయ చిత్ర పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
ఈ సినిమాతో సంచలనాలు సృష్టించబోతున్న మహేష్ బాబు ను తమ బ్రాండ్స్ కు అంబాసిడర్ గా చేసుకోవాలని, తమ వాణిజ్య ప్రకటనల్లో నటింపచేసేలాని చాలామంది కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి.
ప్రస్తుతం తెలుగులో ఎక్కువ వాణిజ్య ప్రకటనల్లో కనిపిస్తున్న నటుడెవరైనా ఉన్నారా అంటే అది మహేష్ బాబు అని చెప్పొచ్చు. అంత పాపులా రిటీనీ సొంతం చేసుకున్నాడు. తాజాగా మహేష్ బాబు ఛరిష్మాను ఉపయోగించుకోవడానికి ప్రము ఖ డిజిటల్ పేమెంట్ సంస్థ ఫోన్ పే రంగంలోకి దిగింది. ఫోన్ పే స్మార్ట్ స్పీకర్లకు మహేష్ తన గొంతును అరువు ఇవ్వబోతున్నారు.