Nara Rohit : సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ఎన్నో మెయిలు రాయి లాంటి సినిమాలు ఉన్నాయి. వాటిల్లో మనమంతా ఎప్పటికీ గుర్తుంచుకునే చిత్రాలలో ఒకటి ‘శ్రీమంతుడు’. వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ అందుకుంటున్న సమయం లో మహేష్ బాబు కి ఈ చిత్రం ఒక సంజీవని లాగ నిల్చింది. ఈ సినిమాకి ముందు విడుదలైన 1 నేనొక్కడినే, ఆగడు వంటి చిత్రాలు ఏ రేంజ్ డిజాస్టర్ ఫ్లాప్స్ అయ్యాయో మనమంతా చూసాము.
మరో సినిమా ఫ్లాప్ అయితే ఇక మహేష్ బాబు సినిమాలు చెయ్యడం దండగ అంటూ అప్పట్లో పలు మీడియా సంస్థలు కథనాలు కూడా ప్రచురించాయి. అలాంటి సమయం లో వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డ్స్ మొత్తాన్ని బద్దలు కొట్టి ఆల్ టైం నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది. ఇప్పటికీ ఈ సినిమా టీవీ లో టెలికాస్ట్ అయ్యినప్పుడు మంచి రేటింగ్స్ రావడాన్ని మనం గమనించొచ్చు.
అయితే ఈ సినిమా కథ నాదే అంటూ శరత్ చంద్ర అనే ప్రముఖ రచయితా కోర్టు లో కేసు వెయ్యగా, అది పెద్ద రచ్చ కి దారి తియ్యడం మనమంతా ఇటీవల కాలం లో చూస్తూనే ఉన్నాం. శరత్ చంద్ర రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్తూ ‘నేను రాసిన ఈ కథని కొరటాల శివ కాపీ కొట్టాడు. ముందుగా నేను ఈ స్టోరీ ని ప్రముఖ యంగ్ హీరో నారా రోహిత్ ని పెట్టి చెయ్యాలని అనుకున్నాను. ఇంతలోపే ఈ కథతో కొరటాల శివ సినిమా తీసేసాడు’ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ సినిమాని మహేష్ బాబు స్థాయి ఉన్న స్టార్ హీరోలు చేస్తేనే హిట్ అవుతాయి. నారా రోహిత్ వంటి వారు చేస్తే క్రిటిక్స్ పరంగా మంచి రేటింగ్స్ రావొచ్చు కానీ, కమర్షియల్ గా మాత్రం వర్కౌట్ అయ్యే అవకాశాలు లేవు.
కానీ ఒకవేళ నారా రోహిత్ ఈ కథని ఒప్పుకొని సినిమా చేసి ఉంటే మహేష్ కి ఒక పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ మిస్ అయ్యేది కదా అని కొంతమంది సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. శ్రీమంతుడు తర్వాత మహేష్ బాబు చేసిన రెండు సినిమాలు ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ అయ్యాయి. ఒకవేళ శ్రీమంతుడు చెయ్యకుండా, నేరుగా ఆ రెండు ఫ్లాప్ సినిమాలను ఎదురుకొని ఉంటే మహేష్ కెరీర్ బాగా ఎఫెక్ట్ అయ్యేది అని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.