Mahesh Babu : కొంతమంది సెలబ్రెటీలు వారు వేసుకునే షర్టులు, ప్యాంట్లకు విపరీతమైన అభిమానులు ఉంటారు. అందులో చాలా మంది వారిని చూసి ఫాలో అవుతుంటారు. ఈ మధ్య మహేశ్ బాబు తన ఇంట్లో దిగిన ఫొటోల్లో ఒక టీషర్టు వేసుకుని కనిపించాడు. అంతే ఫ్యాన్స్ ఆ టీషర్టు అసలు ధర ఎంతని గూగుల్ లో సెర్చ్ చేయడం మొదలెట్టారు.
తీరా ఆ టీ షర్టు ధర తెలిసాక అమ్మ బాబోయ్ మహేశ్ బాబు వేసుకునే బ్రాండ్ వ్యాల్యూ ఇంత ఉంటుందా.. ఏంటీ ఒక్క టీ షర్టుకే ఇంత ధరనా.. అంటూ అవాక్కవుతున్నారు. ఇంతకీ మహేశ్ బాబు వేసుకున్న టీషర్టు ఏమిటంటే బెరూట్ అనే బ్రాండ్ కంపెనీ వారు తయారు చేసిన బ్రాండెడ్ టీషర్టు. ఈ టీ షర్టు ధర 520 యూరోలు. అంటే ఇండియా కరెన్సీలో దాదాపు రూ. 43, 400 వరకు పడుతుంది.
ఒక్క టీషర్టుకే ఇంత ధర పెట్టి కొనుక్కున్నాడా.. మహేశ్ బాబు అనుకుంటూ ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. సెలబ్రెటీల్లో చాలా మంది ఇలా బ్రాండ్లు యూజ్ చేయాలని అనుకుంటారు. అదే విధంగా ఫాలో అవుతారు. ప్రస్తుతం మహేశ్ బాబు సినీ దిగ్గజ డైరెక్టర్ రాజమౌళి మూవీలో యాక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ కోసం వివిధ రకాల హెయిర్ స్టైల్స్ ను మహేశ్ బాబు ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ మూవీ డిటైల్స్ ను చాలా సీక్రెట్ గా నడిపిస్తున్నారు. ఇప్పటి నుంచే సస్పెన్స్ థ్రిల్లర్ పెడితేనే ప్రేక్షకులకు అంచనాలు పెరిగిపోయి… చివరి వరకు దాని గురించి చర్చిస్తూనే ఉంటారు. అలా ఉండటం వల్ల ప్రజల నోళ్లలో నానుతుంది. బాహుబలి టైంలో రాజమౌళి చేసిందదే.. చివరికి ప్రధాని మోదీ కూడా కట్టప్పనే బాహుబలి కో క్యూ మారా అని అడిగాడు. ప్రజల నుంచి సెలబ్రెటీల దాకా అందరి నోళ్లలో నానేలా చేయడం రాజమౌళి క్రియేటివిటీకి నిదర్శనం. అయితే మహేశ్ బాబు, రాజమౌళిల కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీపై అంచనాలు తీవ్రంగా పెరిగిపోయాయి.