JAISW News Telugu

Mahesh Babu : డైలాగ్స్ లో త్రివిక్రమ్ ని మించిపోయిన మహేష్ బాబు..ఇది నిజంగా ఎవ్వరూ ఊహించి ఉండరు!

Mahesh Babu surpasses Trivikram in dialogues

Mahesh Babu surpasses Trivikram in dialogues

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘గుంటూరు కారం’ మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూసారు. మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్ కి ఉన్న క్రేజ్ అలాంటిది.

గతం లో వాళ్ళు ఇండస్ట్రీ ని షేక్ చేసే సినిమాలు చెయ్యకపోయినా కూడా, వాళ్లు కాంబినేషన్ లో వచ్చిన ‘అతడు’ మరియు ‘ఖలేజా’ సినిమాలు ఆడియన్స్ చిరకాలం గుర్తు ఉంచుకునే సినిమాలుగా మిగిలిపోయాయి. అందుకే ఈ కాంబినేషన్ కి అంత క్రేజ్. దానికి తగ్గట్టుగానే ప్రమోషనల్ కంటెంట్ కూడా అదిరిపోయింది. రీసెంట్ గా విడుదలను ట్రైలర్ సినిమా పై మాస్ ఆడియన్స్ లో అంచనాలను అమాంతం పెంచేసాయి. ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ వేరే లెవెల్ లో ఉన్నాయి.

మన రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ కూడా కాసేపటి క్రితమే మొదలయ్యాయి. రెండు ప్రభుత్వాలు ఈ సినిమాకి కావాల్సినంత టికెట్ హైక్స్ ఇచ్చేలోపు, రికార్డు ఓపెనింగ్ వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. అదంతా పక్కన పెడితే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న గుంటూరు లో ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో త్రివిక్రమ్ స్పీచ్ వేరే లెవెల్ లో ఉంటుందని అభిమానులు ఆశించారు. కానీ ఎందుకో ఆయన ఈ సినిమా గురించి చాలా తక్కువగా మాట్లాడాడు. ఆయన తక్కువ మాట్లాడడం పై సోషల్ మీడియా లో ఉండే మహేష్ అభిమానుల్లో అనేక అనుమానాలు తలెత్తాయి. ఎందుకు త్రివిక్రమ్ అంత డల్ గా మాట్లాడుతున్నాడు?, సినిమా బాగా వచ్చిందా రాలేదా అనే సందేహాల్లో పడ్డారు. మరోపక్క మహేష్ మాత్రం మంచి ఎనర్జీ తో మాట్లాడాడు. ఆయన మాటల్లో ఎంతో స్వచ్ఛత కనిపించింది.

త్రివిక్రమ్ మాట్లాడలేదు అనే లోటుని మహేష్ బాబు పూడ్చేసాడు. త్రివిక్రమ్ తో ఆయనకీ ఉన్న సంబంధం ని చెప్పుకుంటూ, ఆయన నా కుటుంబ సభ్యుడు, మన ఇంట్లో వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుకోము కదా, అందుకే నేను త్రివిక్రమ్ గురించి బయట ఎక్కువగా మాట్లాడను అని అంటాడు. ఈ మాటలకు త్రివిక్రమ్ కూడా ఎమోషనల్ అయ్యాడు అనిపించింది. అలా హృదయానికి హత్తుకునే డైలాగ్స్ తో మహేష్ నిన్న ఇచ్చిన స్పీచ్, త్రివిక్రమ్ ని మరిపించింది అనే చెప్పాలి.

Exit mobile version