Mahesh New Look : మహేశ్ న్యూలుక్..గౌతమ్ కు బ్రదర్ అంటే నమ్మేస్తారమో?

mahesh babu new look like brother to his son gautham
Mahesh New Look : మహేశ్.. టాలీవుడ్ మాత్రమే కాదు..ఆల్ ఇండియా సినీ స్టార్స్ లో మిస్టర్ ఇండియా పోటీ పెడితే అగ్రస్థానం ఆయనకే రావాల్సిందే. ఇంతకీ మహేశ్ వయస్సు ఎంత అని ప్రతీ ఒక్కరూ డైలమా పడుతూనే ఉంటారు. ఆయన సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికే దాదాపు 25 సంవత్సరాలు అవుతోంది. ఇంకా కుర్ర హీరోలాగానే కనపడుతుండడంతో అంతా ఆశ్చర్యపోతుంటారు. ఆయన అందం రోజురోజుకూ పెరిగిపోతుండడంతో లేడీ ఫ్యాన్ బేస్ కూడా అదే రేంజ్ లో ఇంకా పెరుగుతూనే ఉంది.
మహేశ్ మరో రెండేండ్లైతే 50వ పడిలో పడుతారు. 1975 ఆగస్టులో జన్మించిన ఆయనకు 48ఏండ్లు. మహేశ్ కు అంత వయస్సు ఉంటుందా? అని ఏ ఒక్కరికి నమ్మశక్యంగా ఉండదు. ఆయన గ్లామర్ మెయింటనెన్స్ అలా ఉంటుంది. ఆయన మేకోవర్ చూస్తే కొడుకు గౌతమ్ కృష్ణ కు బ్రదర్ లా ఉన్నాడనిపిస్తోంది. ఆయన సరసన చేసిన హీరోయిన్లు.. ఇప్పుడు అమ్మపాత్రలు చేస్తున్నారు. ఇక ‘నాని’ సినిమాలో ఐటెం సాంగ్ లో మహేశ్ తో ఘాటుగా రొమాన్స్ చేసినా రమ్యకృష్ణ ‘గుంటూరు కారం’లో ఆయనకు తల్లిగా నటిస్తుండడం విశేషం. అంటే హీరోయిన్లు అమ్మమ్మలు అయినా మహేశ్ మాత్రం ఇంకా అబ్బాయిలాగే ఉండడం ఆయనకు మాత్రమే సాధ్యమేమో అనిపిస్తుంది.
ఇక మహేశ్ నటించిన ‘గుంటూరు కారం’ పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. ఇందులో శ్రీలీల, మీనాక్షి చౌదరి, రమ్యకృష్ణ, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్ తదితరులు నటించారు. ఈ చిత్రం ప్రీసేల్స్ లో రూ.19 కోట్లు ఆర్జించింది. యూఎస్ లో కూడా దుమ్మురేపుతున్నట్లు సమాచారం.
కాగా, సూపర్ స్టార్ లేటెస్ట్ ఫొటో గ్రాఫ్ ఒకటి.. ఇన్ స్టాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఫొటోగ్రాఫ్ లో మహేశ్ కాలేజీ కుర్రాడిని తలపిస్తున్నాడు. మహేశ్ అల్ట్రా స్టైలిష్ అవతార్ అమ్మాయిల మతలు చెడగొడుతోంది. మహేశ్ మరి ఇంత షార్ప్ లుక్ లోకి మారిపోవడం చూస్తుంటే.. రాబోయే రాజమౌళి సినిమా కోసమేనా అని అందరూ అనుకుంటున్నారు. రాజమౌళి సూచన మేరకు ఆ పాత్రలో ఒదిగిపోవడానికి మహేశ్ జిమ్, యోగా, ఫుడ్ రూల్స్ పాటిస్తున్నట్లు తెలుస్తోంది. మహేశ్ తాజా ఫొటోలో రేబాన్ ధరించి, వైట్ కోట్ తో ఇస్మార్ట్ గా కనిపిస్తున్నారు.