Krishna Educational Fund : క్రిష్ణ వర్ధంతి సందర్భంగా మహేష్ బాబు తీసుకున్న నిర్ణయమేంటో తెలుసా?
Super Star Krishna Educational Fund : సూపర్ స్టార్ మహేష్ బాబు సేవా కార్యక్రమాల్లో ముందుంటారు. మహేష్ బాబు ఫౌండేషన్ స్థాపించి వేలాది మంది చిన్నారులకు గుండె జబ్బులకు చికిత్సలు చేయించి వారి కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నాడు. 2500 మంది చిన్నారులకు గుండె జబ్బులున్న పిల్లలకు సాయం చేశారు. దీంతో వారి కుటుంబానికి దేవుడయ్యాడు. పిల్లలకు చేయూతనిచ్చే కార్యక్రమం చేపడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో తన తండ్రి పేరిట సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఎప్పటికి సూపర్ స్టార్ అంటూ క్రిష్ణ ఫొటోను షేర్ చేస్తున్నారు. తన తండ్రి పేరిట ఓ పాఠశాలను నిర్మించారు. మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నాడు. దీనికి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నాడు.
తన తండ్రి పేరు మీద ఓ నలభై మంది విద్యార్థులను శిశు నుంచి పీజీ వరకు చదివించేందుకు ముందుకొచ్చారు. సూపర్ స్టార్ క్రిష్ణ ఎడ్యుకేషనల్ ఫండ్ పేరుతో సంస్థను స్థాపించి విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేసి వారిని చదివించే బాధ్యత తీసుకోవడం గర్వకారణం. మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ కలిసి మహేష్ బాబు ఫౌండేషన్ ను 2020లో ప్రారంభించారు.
ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజల మనసులు దోచుకుంటున్నారు. సూపర్ స్టార్ క్రిష్ణ ఎప్పటికి సూపర్ స్టారే. ఆయన నటించిన సినిమాలు బ్రహ్మాండమైన హిట్లు సాధించాయి. ఈ సందర్భంగా తన తండ్రి నటించిన చిత్రాల గురించి స్మరించుకున్నారు. క్రిష్ణ నటించిన చిత్రాలు ప్రజల మనసులను గెలుచుకున్నాయి. నటుడు, నిర్మాత, దర్శకత్వం వంటి బాధ్యతలు నిర్వహించి మెప్పించారు.