Guntur Kaaram : భారీ అంచనాల నడుమ విడుదలైన సూపర్ స్టార్ మహేష్ బాబు ‘గుంటూరు కారం’ చిత్రం మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. త్రివిక్రమ్ , మహేష్ బాబు కాంబినేషన్ నుండి ఇంత చెత్త సినిమా చూడలేదని, అజ్ఞాతవాసి లాంటి సినిమాని మళ్ళీ చూడలేం అనుకున్నాం కానీ, మళ్ళీ త్రివిక్రమ్ వల్లే అంత కంటే ఘోరమైన సినిమాని చూసాం అంటూ ఫ్యాన్స్ సైతం పెదవి విరిచారు.
కానీ మొదటి రోజు కాంబినేషన్ కి ఉన్న క్రేజ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా 43 కోట్ల రూపాయిలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. కానీ రెండవ రోజు టాక్ ప్రభావం చాలా బలంగా పడింది. కొన్ని సిటీస్ లో అయితే ‘హనుమాన్’ చిత్రానికి టికెట్స్ దొరకక ‘గుంటూరు కారం’ చిత్రానికి వెళ్తున్నారు. రెండవ రోజు కొన్ని ప్రాంతాల వసూళ్లు ఎలా ఉన్నాయో క్రింద చూడండి.
సంక్రాంతి పండుగ సీజన్ లో ఉభయ గోదావరి జిల్లాల్లో వసూళ్లు కళ్ళు చెదిరే రేంజ్ లో ఉంటాయని అంటుంటారు ట్రేడ్ పండితులు. కానీ ‘గుంటూరు కారం’ చిత్రం మాత్రం పూర్ వసూళ్లను దక్కించుంది. ట్రేడ్ లెక్కల ప్రకారం ఈ సినిమాకి ఈస్ట్ గోదావరి జిల్లాలో 43 లక్షలు, అలాగే వెస్ట్ గోదావరి జిల్లాలో 27 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక నెల్లూరు జిల్లాలో అయితే కేవలం 25 లక్షల రూపాయిల షేర్ వసూళ్లతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కృష్ణా జిల్లాలో 50 లక్షలు, ఉత్తరాంధ్ర లో 92 లక్షలు, సీడెడ్ లో 85 లక్షలు రాబట్టిన ఈ చిత్రం నైజాం ప్రాంతం లో మాత్రం మూడు కోట్ల 20 లక్షల రూపాయిల షేర్ వసూలు వచ్చాయి. మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రెండవ రోజు 7 నుండి 8 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
ఈరోజు నా సామి రంగ చిత్రం విడుదల అవ్వడం తో సగానికి పైగా షోస్ రద్దు అయ్యాయి. ఒక్క నైజాం ప్రాంతం లో 600 షోస్ తీసేసారు అంటే , ఏ రేంజ్ లో డ్రాప్ అయ్యాయో అర్థం చేసుకోవచ్చు. బయ్యర్స్ అందరూ భారీ రేట్స్ తో ఈ సినిమాని కొనుగోలు చేసారు. ఈ సంక్రాంతి మూడు రోజులు వచ్చే షేర్ వసూళ్ల మీదనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు, చూడాలి మరి ఎంత చేస్తుందో.