Mahesh Babu : దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి-సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబోలో భారీ మూవీ రాబోతోందని తెలిసిందే. ఈ సినిమాపై ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అవార్డు ముందు నుంచే వార్తలు వినిపిస్తున్నాయి. విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ కూడా పూర్తి చేసి రాజమౌళికి అందజేశారు. మహేశ్ బాబు గుంటూరు కారం రిలీజ్ హడావుడిలో ఉండడంతో మిగతా క్రూను రాజమౌళి సూచా ప్రాయంగా తీసుకున్నట్లు వార్తలు వినిపించాయి.
జక్కన్న – మహేశ్ బాబు కాంబోలో ఇంత వరకు సినిమా రాలేదు. అయితే మహేశ్ రాజకుమారుడు టైంలో రాఘవేందర్ వద్ద రాజమౌళి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. ఇండస్ట్రీలో వీరి కాంబో కోసం చాలా రోజులుగా ఎదురు చూశారు. ఆ కల ఇప్పటికి నెరవేరింది. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే భారీ బడ్జెట్ తో హాలీవుడ్ రేంజ్ లో ఈ మూవీని తెరకెక్కించాలని జక్కన్న ఎప్పుడో ప్రకటించారు. ఈ సినిమా గురించి మరో విషయం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
మహేశ్ బాబు ఈ సినిమాకు రెమ్యునరేషన్ తీసుకోరట. మరి ఎలా? అని అనుమానం సందేహం వస్తుంది కదా? దాని గురించి తెలుసుకుందాం. రాజమౌళి సినిమా అంటే తక్కువలో తక్కువగా రెండేళ్లకు పైగానే ఉంటుంది. ఇక ఎక్కువగా అంటే మూడు నుంచి నాలుగేళ్లు కావచ్చు. జక్కన్న తన సినిమాలో నటించే హీరో మరే సినిమా చేయకూడదనే శరతు పెడతాడు. ఆ విధంగా చూసుకుంటే మహేశ్ బాబు రెండేళ్లకు పైగా డేట్స్ బ్లాక్ చేయాల్సిందే. మహేశ్ బాబు కూడా రెండేళ్లు కాదు.. మూడేళ్లకు కూడా ఇస్తానని, ఈ మూవీ తన కెరీర్ లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఉండాలని అనుకుంటున్నారట. అసలే స్టార్ హీరో.. ఒక సినిమా తర్వాత మరో సినిమా చేసే మిల్కీబాయ్ అన్ని రోజుల డేట్స్ కలుపుకుంటే రెమ్యునరేషన్ కూడా లెక్కకుమించి దాటిపోతుంది.
ఈ మూవీకి నిర్మాత కేఎల్ నారాయణ. పేరుకు ఆయన నిర్మాత అయినా ఫైనాన్స్ వ్యవహారాలన్నీ జక్కన్ననే చూసుకుంటారు. ఆయనపై మరింత భారం మోపకుండా ప్లాన్ చేశారట. రెమ్యునరేషన్ ప్లేస్ లోకి పార్ట్నర్ షిప్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. హీరో కూడా దీనికి ఒప్పుకునే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మూవీ మొత్తం పూర్తయ్యే వరకు తనకు ఒక్క రూపాయి కూడా ఇవ్వక్కర్లేదని మహేశ్ బాబు అంటున్నారట. ఈ వార్తలపై ఎవరూ అఫీషియల్ గా ప్రకటించలేదు.