Mahesh Babu : వారియర్ గా మహేష్ బాబు.. సింహంతో పోరాటం.. రాజమౌళి భారీ ప్లానింగ్.. నిజమేనా?
Mahesh Babu : ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు తో మరో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. అఫీషియల్ గా ఈ సినిమా గురించి ప్రకటన రావడంతో రోజుకో ఊహగానాలు వినిపిస్తున్నాయి. సినిమా నేపథ్యం ఇదేనని, మహేష్ బాబు పలానా క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడని గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. వాటిని అటు హీరో మహేష్ బాబు కానీ, ఇటు రాజమౌళి ఖండించడం లేదు. అలాగని నిజమని చెప్పడం లేదు. దీంతో సూపర్ స్టార్ అభిమానులు తలలు పట్టుకుంటున్నారు. ఏదీ నిజమో, ఏదీ అబద్ధమో తెలియక సతమతమవుతున్నారు.
అయితే ఈసినిమా కచ్చితంగా హాలీవుడ్ స్థాయిలో ఉంటుందని తెలుస్తున్నది. ఇప్పటికే ప్రీ ప్రోడక్షన్ వర్క్ గత ఏప్రిల్, మే నెలల్లోనే స్టార్టయ్యింది. ఫిలిం ఇండస్ట్రీ సమాచారం ప్రకారం అక్టోబర్ లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాల్సి ఉన్నా ఎందుకో వాయిదా పడింది. రాజమౌళి అయితే షూటింగ్ పలానా తేదీన అని ఎప్పుడు చెప్పలేదు. కానీ అక్టోబర్ అలో ఉంటుందని కొద్ది రోజుల క్రితం నిర్మాతలు హింట్ ఇచ్చారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. షూటింగ్ ఎప్పుడు స్టార్టవుతుందా అని మహేష్ బాబు అభిమానులు మాత్రం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి మరో గాసిప్ వినిపిస్తుంది. ఇటీవల రాజమౌళి సింహం ముందుు నిల్చొని, దానిని తీక్షణంగ చూస్తున్న ఫొటో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతున్నది. మహేష్ బాబు తో చేయబోయే సినిమాలో సింహంతో ఫైట్ సీక్వెన్స్ ఉంటుందేమో అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నాడు. ఇక ఇందులో మహేష్ బాబు వారియర్ క్యారెక్టర్ లో నటించబోతున్నాడని, అందుకు తగ్గట్లుగా తన బాడీని ట్రాన్స్ ఫార్మ్ చేస్తున్నాడని తెలుస్తుంది. ఇటీవల మహేష్ బాబు బయటకు కనిపించినప్పుడు శరీరంలో కాస్త మార్పులు కనిపించాయి. ఈ సినిమాలో సింహంతో ఫైట్ పక్కా అంటున్నారు నెటిజన్లు.