Mahesh Babu Adventures : సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం చిత్రం తర్వాత రాజమౌళి తో ఒక సినిమా చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత కేఎల్ నారాయణ నిర్మిస్తున్నాడు. సుమారుగా వెయ్యి కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ ని ఈ సినిమా కోసం ఖర్చు చెయ్యబోతున్నారు. ఫారెస్ట్ అడ్వెంచర్ నేపథ్యం లో సాగే ఈ సినిమా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో ఇప్పటి వరకు ఎవరూ చూడని విధంగా ఉండబోతుంది అట.
ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ మొత్తం దాదాపుగా పూర్తి అయ్యిందని, ఈ ఏడాది లోనే వర్క్ షాప్ ని మొదలు పెట్టి, చివర్లో షూటింగ్ ని కూడా ప్రారంభించేందుకు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తుంది. మహేష్ లుక్ ఈ సినిమాలో ఇప్పటి వరకు ఎవ్వరూ చూడని విధంగా ఉంటుందట. ఆయనకి సంబంధించిన లుక్ టెస్ట్స్ కూడా జరిగిపోయాయి. ఈ లుక్స్ ని బయట లీక్ కాకుండా ఉండేందుకు చాలా స్ట్రిక్ట్ గా ఉండబోతున్నాడట రాజమౌళి.
ఇది ఇలా ఉండగా మహేష్ బాబు ప్రస్తుతం జర్మనీ లో ఫిట్నెస్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడట. అందులో భాగం గా నేడు ఆయన ఫిట్నెస్ ట్రైనర్ హ్యారీ కొనిగ్ తో కలిసి జర్మనీ అడవుల్లో ట్రెకింగ్ చేస్తూ కనిపించాడు. దీనికి సంబంధించిన ఫోటోలను కాసేపటి క్రితమే ఆయన తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసాడు.
ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. ఈ ఫోటోలను చూసి మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ కామెంట్ చేస్తూ, రక్తం గడ్డ కట్టే చలిలో అడవుల్లో ట్రెక్కింగ్ చేస్తున్నావ్, జాగ్రత్త, మిస్ యూ అని చెప్పింది. ఈ కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. వరల్డ్ టూర్స్ కి ఎప్పుడు ఫ్యామిలీ తో కలిసి వెళ్లే మహేష్ బాబు, ఈసారి ఒంటరి గా సినిమా పని కోసం వెళ్ళాడు.